Woman abuses CISF jawan: బెంగళూరు ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ జవాన్‌ను దూషించిన మహిళ
Woman abuses CISF jawan : రూల్స్ బ్రేక్ చేయడమే కాక.. సీఐఎస్ఎఫ్ జవాన్‌పై నోరు పారేసుకుంది ఓ మహిళ. ప్రయాణికులందరి ముందు అతన్ని నోటికొచ్చినట్లు దూషించింది. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Woman abuses CISF jawan : బెంగళూరులోని (Bengaluru) కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో (Kempegowda Airport) ఓ మహిళా (30) ప్రయాణికురాలు సీఐఎస్ఎఫ్ జవాన్‌పై నోరు పారేసుకుంది. అతనిపై దుర్భాషలాడటమే గాక చేతి వేలిని చూపిస్తూ అసభ్యకరమైన సంజ్ఞలు చేసింది. ప్రయాణికులంతా క్యూ లైన్‌లో నిలుచున్న వేళ... సదరు మహిళ నేరుగా ఎంట్రీ పాయింట్ వద్దకు వెళ్లింది. థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి అని తెలిసి కూడా... అదేమీ పట్టించుకోకుండా ముందుకెళ్లింది. అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ జవాన్ మన్‌దీప్ సింగ్ ఆమెను వారించాడు.
వెనక్కి వెళ్లి స్క్రీనింగ్ టెస్టు (Screening test) చేయించుకోవాల్సిందిగా ఆమెను కోరాడు. దీంతో రెచ్చిపోయిన ఆ మహిళా ప్రయాణికురాలు రచ్చ రచ్చ చేసింది. జవాన్‌ను ఇష్టమొచ్చినట్లుగా దూషించింది. అక్కడితో ఆగక, చేతి వేలి చూపిస్తూ అతన్ని కించపరిచేలా వ్యవహరించింది. ఈ వ్యవహారంపై సీఐఎస్ఎఫ్ జవాన్ మన్‌దీప్ సింగ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో క్షణాల్లో సీఐఎస్ఎఫ్ (CISF Jawan) మహిళా సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ మహిళను విమానాశ్రయం నుంచి బయటకు తీసుకెళ్లారు. అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు. ఇండిగో విమానంలో ముంబై వెళ్లేందుకు ఆ మహిళ బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లు తెలుస్తోంది.
కొద్ది వారాల క్రితం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల ఓ యువతి పీకలదాకా తాగి ఓ ఆర్మీ జవాన్‌ను (Army Jawan) దూషించింది. తాగిన మత్తులో ఆమె రోడ్డుపై హంగామా చేస్తుండగా సదరు జవాన్ ఆమెను వారించాడు. దీంతో ఆ మహిళ అతనిపై చేతులు వేసి వెనక్కి నెట్టడమే గాక నోటికొచ్చినట్లు తిట్టింది. ఆ జవాన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... మహిళా పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Omicron: దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు.. పాజిటివ్‌గా తేలితే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook