South Africa arrivals in Mumbai will go to Quarantine said mayor Kishori Pednekar: దక్షిణాఫ్రికా (South Africa) దేశంలో కొత్తగా బయటపడ్డ కరోనా వేరియంట్ ఒమిక్రాన్ (Omicron Variant).. ప్రపంచ దేశాలను ఆందోళనలకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నవారికీ ఈ వేరియంట్ సోకుతుండటంతో అన్ని దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా (Delta Variant) కంటే ఇది ప్రమాదకారి అని ఇప్పటికే నిపుణులు చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపించి.. తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా దేశాలు మళ్లీ ఆంక్షల బాట పట్టాయి. ఇప్పటికే కొన్ని దేశాలు అంతర్జాతీయ రాకపోకలపై కఠిన నియమాలను అమలుపరుస్తున్నాయి.
ఇప్పటికే ఇజ్రాయెల్, బోట్స్‌వానా, బెల్జియం సహా ఇతర దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ పాకడంతో.. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికుల రాకపోకలపై యూకే (UK), ఆస్ట్రేలియా (Australia) తదితర దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ బాటలోనే భారత ప్రభుత్వం (India Govt) కూడా నడుస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి ముంబై (Mumbai) విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్ నిబంధన విధిస్తున్నట్లు నగర మేయర్ కిశోరీ పేడ్నేకర్ (Kishori Pednekar) శనివారం ఉదయం ప్రకటించారు. ఒకవేళ ఎవరైనా పాజిటివ్‌గా తేలితే.. సంబంధిత ప్రయాణికుల శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ (Genome Sequencing) ల్యాబ్‌లకు పంపుతామన్నారు.
Also Read: Krunal Pandya: సంచల నిర్ణయం తీసుకున్న కృనాల్ పాండ్యా.. గుడ్‌బై చెప్పేశాడు!!
ముంబై మేయర్ కిశోరీ పేడ్నేకర్ (Kishori Pednekar) మీడియాతో మాట్లాడుతూ... 'దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. దాంతో ముంబై నగరంలో ఆందోళన నెలకొంది. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకునే దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి సారించాం. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్ (Quarantine) నిబంధన విధించాం. ఎవరైనా పాజిటివ్‌గా తేలితే వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లకు పంపుతాం. అయితే ఇక్కడి నుంచి వెళ్లే విమానాలపై మాత్రం ఎటువంటి ఆంక్షలు లేవు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ.. తప్పనిసరిగా మాస్కు ధరించాలి' అని విజ్ఞప్తి చేశారు.
Also Read: Pragya-Salman: సల్మాన్ సినిమాలో ప్రగ్యాకు అవకాశం వచ్చినట్టే వచ్చి...చివరకు..!
కొత్త వేరియంట్ ఆందోళనలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఉన్నతాధికారులతో శనివారం కీలక సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఉన్నతాధికారులతో చర్చించారు. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతిఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం నిర్వహించి.. ఈ వేరియంట్‌ను ఆందోళనకర రకంగా ప్రకటించింది. యావత్ దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook