ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. కనీసం పసిపిల్లలు అని కూడా చూడకుండా కొందరు అయినవారే.. శాడిస్టుల్లా ప్రవర్తిస్తూ వారికి నరకయాతన చూపిస్తున్నారు. మానవత్వాన్ని మరిచిపోతున్నారు. కనీసం కరుణ, జాలి కూడా లేకుండా అలా పిల్లలను హింస పెట్టేవారిని చూస్తే మన కళ్లు చెమర్చక మానవు. అయితే ఎందుకు మనుష్యులు ఇంతలా దిగజారిపోయి ప్రవర్తిస్తారనే విషయానికి అనేక కారణాలు ఉంటాయని చెబుతున్నారు మానసిక నిపుణులు. కోపం, అసూయ, పిల్లలపై పెంచుకొనే అర్థం లేని ద్వేషం.. ఇలాంటివన్నీ ప్రధాన కారణాలు కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో ఛండీగఢ్‌ ప్రాంతంలో ఇటువంటి సంఘటనే జరిగింది. జస్మీత్ కౌర్ అనే మహిళ తన 5 ఏళ్ళ సవతి కుమార్తెను ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నరకయాతనకు గురిచేసింది. విపరీతంగా కొట్టడంతో పాటు ఒక గోనెసంచిలో బాలికను దూర్చి కట్టేసి.. తర్వాత పదే పదే నేలకేసి బాదసాగింది. ఆ ఘటనను ఎవరో వీడియో తీసి బాలిక తండ్రికి చూపెట్టడంతో ఆయన స్థానిక పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం జస్మీత్ పై సెక్షన్ 75 జువైనల్ జస్టిస్ యాక్ట్ మరియు సెక్షన్ 323 క్రింద కేసు నమోదు చేశారు.