కాంగ్రెస్ మహిళ ఎమ్మెల్యే విజయధరణి విషయంలో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పి.ధన్ పాల్ అభ్యంతరకర రీతిలో స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ ప్రముఖ మీడియా కథనం ప్రకారం.. తన నియోజకవర్గంలో షార్ట్ సర్క్యూట్స్  కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ఇచ్చే పరిహారం అంశాన్ని సభలో ఎమ్మెల్యే ధరణి ప్రశ్నించే ప్రయత్నం చేయగా స్పీకర్ దీన్ని  స్పీకర్ తిరస్కరించారు. ఈ సమస్యపై సభాపతి స్పందించాలని మహిళా ఎమ్మెల్యే వారించగా .. సంబంధిత శాఖమంత్రితో  వ్యక్తిగతంగా డీల్ చేసుకోవాలని చెప్పినట్లు సమచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళకు రక్షణ కరువు


వివాదాస్పద ఈ అంశంపై సంబంధిత ఎమ్మెల్యే విజయధరణి స్పందిస్తూ  స్పీకర్ సభాముఖంగానే తనను మంత్రితో వ్యక్తిగతంగా డీల్ చేసుకోవాలని చెప్పారు. స్పీకర్ స్థాయిలో ఉండి అలా మాట్లాడటం సిగ్గుచేటు అని వెల్లడించారు. నాకు కన్నీళ్లు వచ్చాయి.  జీరో అవర్ లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించేందుకు అవకాశం ఇవ్వనని చెప్పారు...అసెంబ్లీలోనే మహిళల పరిస్థితి ఇలా ఉంటే.. సామాన్య మహిళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంటూ ఎమ్మెల్యే ధరణి మీడియా ముందు  వాపోయారు. 


మాటల్ని వక్రీకరించారు..


స్పీకర్  పి.ధన్ పాల్ మాటలను వక్రీకరించేందుకే ప్రయత్నిస్తున్నారని అన్నాడీఎంకే నేతలు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో  విజయధరణి లేవనెత్తిన సమస్యను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని మాత్రమే స్పీకర్  సూచించారని..దీన్ని మరో రకంగా చిత్రీకరించి రాద్ధాంతం చేస్తున్నారని వెల్లడించారు. తమ ప్రభుత్వాన్ని బద్నామ్ చేసే కుట్రలో భాగమే ఇలాంటి ఆరోపణలంటూ అన్నాడీఎంకే వర్గాలు ఎదురుదాటికి దిగాయి.