IndiGo విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
విమానంలో ఓ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo flight) లో ఓ మహిళ (Woman delivers baby ) ప్రసవించింది. అయితే తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఇండిగో (IndiGo) వెల్లడించింది.
Woman delivery in Delhi-Bengaluru flight: న్యూఢిల్లీ: విమానంలో ఓ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo flight) లో ఓ మహిళ (Woman delivery baby ) ప్రసవించింది. అయితే తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఇండిగో (IndiGo) వెల్లడించింది. ఇండిగో 6ఈ 122 విమానంలో సాయంత్రం వేళ ఢిల్లీ నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్న ఓ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు ఇండిగో సిబ్బంది సేవలందించారని.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది వెల్లడించారు.
[[{"fid":"194553","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Woman delivery in Flight","field_file_image_title_text[und][0][value]":"విమానంలో ప్రసవించిన మహిళ"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Woman delivery in Flight","field_file_image_title_text[und][0][value]":"విమానంలో ప్రసవించిన మహిళ"}},"link_text":false,"attributes":{"alt":"Woman delivery in Flight","title":"విమానంలో ప్రసవించిన మహిళ","class":"media-element file-default","data-delta":"1"}}]]
అయితే రాత్రి 7.30 గంటలకు బెంగళూరు (Bengaluru) లో విమానం ల్యాండ్ అయిన వెంటనే తల్లీ బిడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించినట్లు ఇండిగో పేర్కొంది. ఈ సందర్భంగా బెంగళూరు ఎయిర్‌పోర్టులో తల్లీబిడ్డలకు గొప్ప స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇండిగో సిబ్బంది తల్లీబిడ్డలతో దిగిన ఫొటోలను సోషల్ మీడియా ( social media ) ప్లాట్‌ఫాంలల్లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
[[{"fid":"194554","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Woman delivery in Flight","field_file_image_title_text[und][0][value]":"విమానంలో మహిళ ప్రసవం"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Woman delivery in Flight","field_file_image_title_text[und][0][value]":"విమానంలో మహిళ ప్రసవం"}},"link_text":false,"attributes":{"alt":"Woman delivery in Flight","title":"విమానంలో మహిళ ప్రసవం","class":"media-element file-default","data-delta":"2"}}]]
అయితే ఇండిగో విమానంలో రాత్రి 6.10 గంటలకు మహిళ ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందని కెప్టెన్ క్రిష్టోఫర్ ట్వీట్ వేదికగా పంచుకున్నారు. అయితే తల్లీ బిడ్డలకు విమాన సిబ్బంది సేవలందించారని.. తమ విమానంలో మహిళ బిడ్డకు జన్మనివ్వడం తమకు గర్వకారణమని కెప్టెన్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో జన్మించిన బిడ్డకు జీవితకాలంపాటు ఉచిత విమాన టికెట్‌ను ప్రకటించినట్లు ఎన్‌బీటీ వార్తకథనంలో పేర్కొంది. Also read: Sasikala: చిన్నమ్మకు భారీ షాక్.. 2వేల కోట్ల ఆస్తుల జప్తు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe