సింహాల మధ్య మహిళ ప్రసవం..!!
గుజరాత్‌లో ఓ నిండు గర్భిణీ భయంకరమైన పరిస్థితి ఎదుర్కుంది. నట్టడవిలో ప్రసవించాల్సిన పరిస్థితి వచ్చింది. గిర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేస్తోంది. ఐతే పూర్తిగా సక్రమంగా జరిగింది కాబట్టి.. అంతా ఊపిరిపీల్చుకున్నారు.
గుజరాత్‌లో ఓ నిండు గర్భిణీ భయంకరమైన పరిస్థితి ఎదుర్కుంది. నట్టడవిలో ప్రసవించాల్సిన పరిస్థితి వచ్చింది. గిర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేస్తోంది. ఐతే పూర్తిగా సక్రమంగా జరిగింది కాబట్టి.. అంతా ఊపిరిపీల్చుకున్నారు.
చుట్టూ సింహాలు..
నడుమ ఆంబులెన్స్..
ఆంబులెన్స్‌లో నిండు గర్భిణీ
అప్పుడు ఏం జరిగింది..?
గిర్ అటవీ ప్రాంతం సింహాలకు ప్రసిద్ధి. అక్కడ ఉండే వారికి తరచుగా వాటితో సహవాసం తప్పదు. కానీ ఓ నిండు గర్భిణీ మాత్రం భయంకరమైన పరిస్థితి ఎదుర్కుంది. గిర్ సోమ్‌నాథ్‌లో ఉంటున్న ఆమెకు అర్ధరాత్రి పూట నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆంబులెన్స్‌కు ఫోన్ చేశారు. వెంటనే ఆంబులెన్స్ ఆమె ఇంటికి చేరుకుంది. ఆస్పత్రికి ప్రయాణం ప్రారంభమైంది. మధ్యలో గిర్ అటవీ ప్రాంతం గుండా వెళ్లాలి. సరిగ్గా నట్టడవిలోకి వెళ్లిన తర్వాత ఆంబులెన్స్‌కు నాలుగు సింహాలు ఎదురయ్యాయి. దీంతో ఆంబులెన్స్ డ్రైవర్.. వాహనాన్ని అక్కడే నిలిపి ఉంచాడు.
[[{"fid":"185857","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఇంతలో లోపల ఉన్న గర్భిణీకి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఓ వైపు ఆంబులెన్స్ కదలడానికి వీళ్లేకుండా సింహాలు తిష్టవేసుకుని కూర్చున్నాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు మరో దారి కూడా లేదు. దీంతో ఆంబులెన్స్‌లో ఉన్న అత్యవసర సిబ్బంది.. అన్నీ తామే అయి పురుడు పోశారు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
[[{"fid":"185858","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
ప్రసవం పూర్తయిన తర్వాత కూడా తల్లీ, బిడ్డను ఆస్పత్రికి తరలించేందుకు ఆంబులెన్స్ సిబ్బంది సిద్ధమయ్యారు. కానీ దాదాపు అరగంటపాటు సింహాలు అక్కడి నుంచి కదలలేదు. చివరకు అవి వెళ్లిపోయిన తర్వాత తల్లీ, బిడ్డను ఆస్పత్రికి చేర్చారు. వారిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు..
[[{"fid":"185859","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..