Woman gets kidney as rakhi gift from younger brother in goa: శ్రావణమాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగా జరుపుకుంటాం. ఈ పండుగను ముఖ్యంగా సోదరులు, సోదరీమణులు ఎంతో ప్రేమగాజరుపుకుంటారు. అన్నతమ్ముల అనురాగాలు, ఆప్యాయతలకు ఈ పండుగ నిదర్శనమని చెప్తుంటారు. అంతేకాకుండా.. ఈరోజున తమ సోదరుడు ఎక్కడున్న వెళ్లి మరీ రాఖీలు కట్టేసి వస్తుంటారు. రాఖీ పండుగ వెనుకాల పురాణ గాథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇంద్రుడి భార్య.. ఇంద్రాణి రాఖీ రక్ష కట్టి దానవుల మీద గెలిచేలా చేస్తుంది. అదే విధంగా.. ద్రౌపదీ కృష్ణుడికి కూడా రాఖీకడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందుకే ఆయన కౌరవ సభలో, తన సోదరిని ఆదుకుంటాడు. అదే విధంగా విష్ణుదేవుడి సతీమణి శ్రీలక్ష్మి సైతం.. బలిచక్రవర్తికి రాఖీకట్టిందని చెబుతుంటారు. అంటే... రాఖీ పండుగ అనేది అంతటి పవిత్రమైందని చెప్తుంటారు. తమ సోదరుడు అన్నివిధాలుగా జీవితంలో ఆనందంగా ఉండాలని సోదరీమణులు రాఖీలు కడుతుంటారు. మరోవైపు.. సోదరులు తమ అక్కాచెల్లెమ్మలకు గిఫ్ల్ లు ఇస్తుంటారు. ఇదిలా ఉండగా.. ఒక సోదరుడు, తన అక్కకు కిడ్నీను రాఖీ పండుగ గిఫ్ట్ గా ఇస్తాడు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు..


దక్షిణ గోవాకు చెందిన 43 ఏళ్ల మహిళకు రక్షా బంధన్ పండుగ స్పెషల్ గా మారిందని చెప్పుకొవచ్చు. ఆమె తమ్ముడు అందరిలాగా.. ఈ ఏదో చీరనో, గిఫ్ట్ ఇవ్వలేదు. ఏకంగా తన సోదరి ప్రాణాలు నిలిచేలా ఏకంగా తన కిడ్నీనే దానంగా ఇచ్చాడు. సదరు మహిళ.. పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధితో బాధపడుతుంది. వెంటనే ఆమెకు కొత్త కిడ్నీను అమర్చాలని వైద్యులు సలహా ఇస్తారు. దీంతో తన సోదరిబాధను చూసి తాళలేక... ఆమె  సోదరుడు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వస్తాడు. కానీ అతనికి కిడ్నీ సమస్యలు ఉండటం వల్ల.. దానికి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు.


ఆతర్వాత ఒక కిడ్నీని తన సోదరికి ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. కొన్నిరోజుల క్రితమే వైద్యులు ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు. అతను.. ఒకే కిడ్నీతో ఉన్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆమె సోదరుడికి అప్పటికే పెళ్లి కూడా అయ్యింది. అతని భార్యసైతం దీనికి అడ్డుచెప్పలేదు. ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం కిడ్నీ దానంచేయగా.. ఆమెకు సర్జరీని వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.


Read more: Venu Swamy: ఆత్మహత్యకు సిద్ధమైన వేణుస్వామి దంపతులు..?.. సంచలనంగా మారిన వీడియో..


ఈరోజు రాఖీ పండుగ నేపథ్యంలో.. రాకీ కట్టుకొవడానికి తన సోదరుడు ఆమె ఇంటికి వెళ్లాడు. దీంతో అతడిని చూసి ఆమె ఎమోషనల్ అవుతుంది. ఈరోజు తన సోదరుడు లేకుంటే.. తను ఉండేకాదని కూడా కన్నీళ్లు పెట్టుకుంది. చిన్నప్పటి నుంచి వీరి మధ్య ఎంతో ప్రేమానురాగాలు ఉండేవారని కూడా.. మహిళ భర్తచెప్తున్నాడు. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter