ఓ బ్యాంకు మేనేజర్‌ను మహిళ చెప్పుతో చితకబాదింది. ఈ సంఘటన కర్ణాటకలోని దేవనాగరిలో సోమవారం జరగ్గా.. ఈరోజు వెలుగులోకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. దేవనాగరికి చెందిన ఓ మహిళ లోన్ కోసం స్థానిక బ్యాంక్‌కు వెళ్లింది. అయితే లోన్ కావాలంటే తన కోరిక తీర్చాలని బ్యాంకు మేనేజర్ కోరాడట. దీంతో ఆ మహిళకు కోపం కట్టలు తెచ్చుకుంది. బ్యాంకు మేనేజర్ అసభ్యంగా ప్రవర్తించడంతో.. అతడిని నడిరోడ్డుపైకి ఈడ్చుకెళ్లి కర్రతో దేహశుద్ధి చేసింది. ఆతర్వాత చెప్పుతో చితకబాదింది. బ్యాంకు మేనేజర్‌ను మహిళ చితకబాదుతున్న దృశ్యాలను, వీడియోను కొందరు తీసి.. సామాజిక మాధ్యమాల్లో వైపోస్టు చేయగా.. ఆవి వైరల్ అవుతున్నాయి.