Non-Veg Pizza : శాఖహారి అయిన ఓ మహిళకు వెజ్‌కు బదులుగా నాన్‌వెజ్ పిజ్జా డెలివరీ చేయడంతో ఏకంగా 1 కోటి రూపాయాల పరిహారం కోరుతూ దావా వేసింది. దాంతో విషయం వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం
 షాక్ అవుతున్నారు. మరో నాలుగు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. ఆ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ దీపాళీ త్యాగి తన పిల్లలకు ఆకలిగా ఉందని శాఖారం (Mushroom Pizza) పిజ్జాను మార్చి 21, 2019న ఆర్డర్‌ చేసింది. అయితే అమెరికన్‌ రెస్టారెంట్‌ ఔట్‌లెట్‌ ఆమెకు నాన్‌వెజ్ పిజ్జాను డెలివరీ చేసింది. అది కూడా అరగంట ఆలస్యంగా తన ఇంటికి డెలివరీ బాయ్ పిజ్జా తెచ్చి డెలివరీ చేశారని కోటి రూపాయల నష్టపరిహారానికి కేసు వేసింది.


Also Read: SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులు ఈ ఒక్కరోజు UPI ట్రాన్సాక్షన్స్ చేయవద్దు, ఎందుకంటే


తన మత విశ్వాసాల ప్రకారం కుటుంబం మొత్తం శాఖాఖారమే భుజిస్తుందని, అయితే పవిత్రమైన పండుగ రోజున తన చిన్నారులకు ఆకలిగా ఉందని వెబ్ పిజ్జా ఆర్డర్ చేసినట్లు దావాలో దీపాళీ త్యాగి పేర్కొంది. అసలే ఆకలిగా ఉన్న చిన్నారులతో పాటు తాను పిజ్జా రుచి చూసి కంగుతిన్నామని చెప్పింది. తమకు నాన్‌వెజ్ పిజ్జాను అమెరికా రెస్టారెంట్ ఔట్‌లెట్ డెలివరీ చేసిందని, అది తినడం వల్ల తమ మత విశ్వాసాలు, మనోభావాలు దెబ్బతిన్నాయని తమకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది.  


Also Read: YSRCP: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ హవా.. క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోన్న వైఎస్సార్‌సీపీ


తమకు ఎందుకిలా నాన్‌వెజ్ డెలివరీ చేశారని ప్రశ్నించగా, మేనేజర్ వారి కుటుంబానికి వెజ్ పిజ్జాను పంపించారు. తమ విశ్వాసాలు, మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఇది చిన్న విషయం కాదని ఆమె తన దావాలో పేర్కొన్నారు. మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారి చర్యల కారణంగా తాము ఎంతో నష్టపోయాయని.. కుటుంబం మొత్తానికి మానసిక ప్రశాంతత కరువైందని నష్టపరిహారం డిమాండ్ చేసింది. దీనిపై ఢిల్లీకి చెందిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ ఆ అమెరికా ఔట్‌లెట్‌కు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. మార్చి 17న ఈ కేసు తదుపరి విచారణ చేపట్టనున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook