SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులు ఈ ఒక్కరోజు UPI ట్రాన్సాక్షన్స్ చేయవద్దు, ఎందుకంటే

SBI Alert Customers: ఎస్‌బీఐ కస్టమర్లకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తాము కొన్ని మార్పులు చేస్తున్నామని ఈ సమయంలో లావాదేవీలలో సమస్య తలెత్తితే సంయమనం పాటించాలని కోరింది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 14, 2021, 12:16 PM IST
SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులు ఈ ఒక్కరోజు UPI ట్రాన్సాక్షన్స్ చేయవద్దు, ఎందుకంటే

SBI Alert Customers: దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. యూపీఐ ప్లాట్‌ఫాంలలో మార్పుల చేస్తున్న కారణంగా నేడు UPI ట్రాన్సాక్షన్‌లకు అంతరాయం ఏర్పడవచ్చునని పేర్కొంది. మీరు ఎస్‌బీఐ ఖాతాదారులైతే మార్చి 14న మీ యూపీఏ లావాదేవీలకు అసౌకర్యం కలగనుందని సూచించింది.

ఎస్‌బీఐ కస్టమర్లకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తాము కొన్ని మార్పులు చేస్తున్నామని ఈ సమయంలో లావాదేవీలలో సమస్య తలెత్తితే సంయమనం పాటించాలని కోరింది. అందుకే ఆదివారం (మార్చి 14) నాడు UPI స్థానంలో యోనో, యోనోలైట్, Internet Banking, ఏటీఎంల ద్వారా లావాదేవీలు చేసుకోవాలని తన ఖాతాదారులకు State Bank of India సూచించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన చేసింది.

Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 14, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం 

దేశంలో భారీ మొత్తంలో ఉన్న ఎస్‌బీఐ ఖాతాదారులకు అసౌకర్యం కలగకూడదని భావించి ముందుగానే వారిని అలర్ట్ చేసింది. కనుక ఎస్‌బీఐ తాజాగా ప్రకటించిన సూచనల ప్రకారం ఖాతాదారులు YONO, యోనోలైట్, ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు జరుపుకుంటే ఏ ఇబ్బంది తలెత్తదని ప్రత్యామ్నాయ మార్గాలను సూచించింది. 

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్, త్వరలోనే Dearness Allowance జమ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News