చెన్నై: ద్రావిడ ఉద్యమ పితామహుడిగా పేరుగాంచిన సంఘ సంస్కర్త రామస్వామి పెరియార్‌పై చేసిన వ్యాఖ్యలపై వెనక్కితగ్గేది లేదన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. పెరియార్‌పై చేసిన వ్యాఖ్యలు తన సొంత మాటలు కాదని, తాను చూసిన వీడియోలు, ఓ మ్యాగజైన్ కథనంలో ఉన్న విషయాన్నే తాను ప్రస్తావించినట్లు చెప్పారు. తాను ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నల్ల దుస్తులు ధరించిన కొందరు ద్రావిడర్ విడుదలై కళగమ్ (డీవీకే) సభ్యులు రజనీకాంత్ క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన ఇంటి ముందు నిరసన తెలిపారు. అనంతరం రజనీ మీడియాతో మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ జనవరి 14న తుగ్లక్ వార పత్రిక 50వ వార్షికోత్సవంలో రజనీ పాల్గొన్నారు. 1971లో సేలంలో పెరియార్ రామస్వామి నిర్వహించిన ర్యాలీపై కేవలం తుగ్లక్ మ్యాగజైన్‌లో కథనం ప్రచురితమైందని, అందుకు కారణం ఫౌండర్, దివంగత చో రామస్వామి కారణమని కొనియాడారు. సేలంలో పెరియార్ నిర్వహించిన ఆ ర్యాలీలో సీతారాముల విగ్రహాలను చెప్పుల దండలు వేసిన అసభ్యకరంగా ఉరేగించారని రజనీ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో దుమారం రేపుతున్నాయి. అయితే అధికార డీఎంకే ఆ ర్యాలీ వార్త తమకు చెడ్డపేరు తెస్తుందని భావించి మ్యాగజైన్‌ను అడ్డుకోవాలని చూసిందన్నారు. అయితే రూ. 10కే విక్రయించే ఆ మ్యాగజైన్‌ను చో రామస్వామి.. ఆ ర్యాలీ వార్తను ప్రింట్ చేసి రూ.50 నుంచి రూ.60కి సీక్రెట్‌గా అమ్మారని రజనీ ఉపన్యాసంలో తెలిపారు.  


తెలిపారు. దీంతో రజనీకాంత్‌.. పెరియార్‌ గురించి తప్పుడు ఆరోపణలు చేశారంటూ ద్రవిడర్‌ విడుదలై కళగమ్‌ అధ్యక్షుడు మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ వ్యాఖ్యలపై ద్రావిడర్‌ విడుదలై కళగం నేతలు మండిపడుతున్నారు. రజనీ.. రాజకీయ ప్రవేశం కోసమే పెరియార్ గౌరవ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోవై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ద్రవిడర్‌ విడుదలై కళగమ్‌ అధ్యక్షుడు మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు రజనీపై కేసు నమోదు చేశారు.


కాగా, పెరియార్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ద్రావిడర్ విడుదలై కళగమ్ (డీవీకే) అధ్యక్షుడు మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రజనీకాంత్‌పై ఐపీసీ 153 ఏ, 505 సెక్షన్ల కింద నమోదైన విషయం తెలిసిందే. అయితే రాజకీయ అరంగేట్రం కోసం రజనీ ఈ వ్యాఖ్యలు చేశారని పొలిటికల్ సర్కిల్స్‌ నుంచి విమర్శలొస్తున్నాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..