SEX on Vehicle number plate : ఢిల్లీకి (Delhi) చెందిన ఓ ఫ్యాషన్ డిజైన్ స్టూడెంట్‌ తన ఇనిస్టిట్యూట్‌కు వెళ్లేందుకు ప్రతీరోజూ జానకిపురా నుంచి నోయిడాకు మెట్రోలో ప్రయాణం చేస్తుంది. కాలేజీకి స్కూటీపై (Scooty) వెళ్లాలనేది ఆమె కోరిక. ఏడాది పాటు తండ్రిని రిక్వెస్ట్ చేస్తే... ఎట్టకేలకు ఈ దీపావళికి స్కూటీ కొనిచ్చాడు. తండ్రి ఇచ్చిన గిఫ్ట్‌కు ఆమె చాలా మురిసిపోయింది. కానీ ఇప్పుడా స్కూటీపై కాలేజీకి వెళ్లేందుకు సంకోచిస్తోంది. కారణం స్కూటీకి ఉన్న నంబర్ ప్లేట్‌పై SEX అని ఉండటం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ ఆర్టీవో ఆమె స్కూటీకి ఇచ్చిన నంబర్ 'DL 3 S EX****'. నంబర్ ప్లేట్‌పై (Vehicle Number Plate) ఉన్న ఆ ఇంగ్లీష్ అక్షరాల కారణంగా.. దానిపై బయటికెళ్లినప్పుడల్లా పోకిరీల నుంచి కామెంట్స్ ఎదురవుతున్నాయి. దీంతో ఆ నంబర్ ప్లేట్ ఆమెకు చాలా ఇబ్బందిగా మారింది. కూతురు పడుతున్న ఇబ్బంది చూసి ఆమె తండ్రి ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి నంబర్ మార్చాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేశాడు. అయితే అధికారులు అందుకు నిరాకరించారు. ఒకసారి నంబర్ ఇష్యూ చేశాక.. దాన్ని తిరిగి మార్చేందుకు ఎటువంటి ప్రొవిజన్ లేదని చెప్పారు. ఢిల్లీలో (Delhi) చాలా టూవీలర్స్‌కు ఆ సిరీస్ కేటాయించామని... వాటిని మార్చడం కుదరని పని అని తెలిపారు.


ఢిల్లీలో వాహనాలకు (Delhi Vehicles) కేటాయించే నంబర్స్ DLతో మొదలవుతాయి. ఆ తర్వాత సంబంధిత జిల్లాను బట్టి కేటాయించే నంబర్, వాహనాన్ని బట్టి ఇచ్చే సింగిల్ లెటర్, రెండక్షరాల లేటెస్ట్ సిరీస్, నాలుగంకెలు.. ఇవన్నీ వరుస క్రమంలో ఉంటాయి. ఉదాహరణకు DL 2 C AD 1234. ఇక్కడ 2 అనే నంబర్ తూర్పు జిల్లాను సూచిస్తుంది. C అంటే  కారు. AD అనేది నంబర్ సిరీస్. అదే టూవీలర్స్ (Two Wheelers) అయితే C లెటర్ స్థానంలో S అనే లెటర్ ఉంటుంది. దాని తర్వాత వచ్చే నంబర్ సిరీస్‌లో EX అనే లెటర్స్‌ ఉండటం ఇప్పుడు ఢిల్లీలో (Dehi) చాలామంది ద్విచక్రవాహనదారులకు ఇబ్బందిగా మారింది. 'S EX' అనే నంబర్ సిరీస్ ఉన్న వాహనదారులు.. ఆ సిరీస్‌తో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. మరోవైపు ఆర్టీవో అధికారులు దాన్ని మార్చడం కుదరని పని అని చెప్తుండటంతో ఆ సిరీస్ కలిగిన వాహనదారులకు తిప్పలు తప్పేలా లేవు.


Also Read: Gold Smuggling Hyderabad: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో హైదరాబాదీ నగల వ్యాపారి అరెస్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook