కరోనా వైరస్ మహమ్మారి పలానా రంగం మీద అని చెప్పలేనంతగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.  వైరస్ ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఆయుధంగా ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) ఇచ్చాయి. ఇంటి వద్ద నుంచే పని చేయడం మొదలుపెట్టాక అది ఉద్యోగుల నిద్రపై ప్రభావం చూపుతోందట.  పెళ్లి ఆగిందని వధువు ఆత్మహత్య


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ వేక్‌ఫిట్ ఉద్యోగుల మూడు వారాల వర్క్ ఫ్రమ్ హోమ్‌పై సర్వే చేసి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పలు నగరాల్లో కలిపి మొత్తం 1500 మందిపై సర్వే చేసింది. ఉద్యోగులు నిద్రలేమి సమస్యతో సతమతవుతున్నారని, వారికి ఇంటి పనులు అదనపు భారంగా మారినట్లు గుర్తించారు. లాక్‌డౌన్ పూర్తయితే నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చునని 81శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ‘క్రికెట్ అంటే పిచ్చి.. కానీ ఈ ఐపీఎల్ కష్టమే’


లాక్‌డౌన్‌ విధించక ముందు రాత్రి 11గంటలలోపు 46శాతం ఉద్యోగులు నిద్రపోయేవారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు మొదలయ్యాక రాత్రి 11లోపు కేవలం 39శాతం మంది నిద్రపోతున్నారని తేలింది. కొన్ని నగరాలలో 67శాతం మంది  ఉద్యోగుల నిద్రవేళల్లో పూర్తిగా మార్పులు జరిగాయని గుర్తించారు. 


గతంలో 25శాతం మంది రాత్రి 12 గంటల తర్వాత నిద్రించేవారు కాగా, తాజాగా 35శాతానికి ఆ సంఖ్య పెరిగింది. అంటే దాదాపు 40శాతం ఉద్యోగులు నిద్రించే సమయం చాలా ఆలస్యమవుతోంది. నిద్రపై ఎందుకు ప్రభావం పడుతుందన్న ప్రశ్నకు.. సమయానికి చేతికి డబ్బు వస్తుందా లేదా, జాబ్ తీసేస్తారేమో లాంటి కారణాలు 49శాతం మంది ప్రస్తావించడం గమనార్హం. PHotos: హెబ్బా.. అందాలు చూస్తే అబ్బా!


కాగా, వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో ఇంట్లో పిల్లలకు సర్ది చెప్పడం, వారికి స్కూల్ లేకపోవడంతో వారి అల్లరిని తట్టుకుని పనిచేయడం, పనివాళ్లు రాకపోవడంతో ఇంటి పనులలో సాయం చేయడం, వర్క్ టార్గెట్ రీచ్ కావడం లాంటి ఆలోచనలతో నిద్రలేమి సమస్యలు పెరిగిపోతున్నట్లు ఆ కంపెనీ సర్వేలో తేలింది. ఈ మధ్య గృహహింస కేసులు పెరిగిపోతున్నాయి. ఈ మేరకు కథనాలు సైతం వెలుగుచూస్తున్నాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos


 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos