ప్రపంచపు అతి ఎత్తైన వంతెన వచ్చే యేడాదికి ప్రారంభం కానుంది. ఈఫిల్ టవర్ ( Eiffel Tower ) కంటె ఎత్తైన ఈ వంతెన అత్యంత ఆధునికమైంది. ప్రకృతి వైపరీత్యాల్ని కూడా తట్టుకునే సామర్ధ్యాన్ని కలిగింది. ఇంతకీ ఆ వంతెన ఎక్కడ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


జమ్మూకశ్మీర్ ( Jammu Kashmir ) చీనాబ్ నది ( Chenab River ) పై ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన ( World Tallest Rail Bridge )  నిర్మాణంలో ఉంది. ఈ పనులు వచ్చే యేడాదికి పూర్తయి..2022 డిసెంబర్ లో తొలి రైలు ప్రయాణించే అవకాశాలున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కశ్మీర్ ను మిగిలిన దేశంతో కలిపే ఈ వంతెనను అత్యంత శక్తివంతంగా, ఆధునికంగా తీర్దిదిద్దుతున్నారు. 359 మీటర్ల ఎత్తులో 1315 మీటర్ల పొడవైన ఈ వారధి ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెనగా ఉండనుంది. ఈ వంతెనను గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల్ని కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. Also read: Rakhi: గట్టి దెబ్బే తగిలింది, 4 వేల కోట్ల నష్టం


ఢిల్లీలోని కుతుబ్ మినార్ ఎత్తు 72 మీటర్లు కాగా..ఈఫిల్ టవర్ ఎత్తు ( Eiffel tower height ) 324 మీటర్లుగా ఉంది. ఈ వంతెన నది అడుగు నుంచి లెక్కవేస్తే 359 మీటర్ల ఎత్తుతో ఈఫిల్ టవర్ ఎత్తును దాటేస్తుంది. ఈ రైల్వే లైన్ మార్గంలో ఇప్పటికే ఉధంపూర్-కాట్రా సెక్షన్, బనిహాల్-క్వాజిగుండ్ సెక్షన్, క్వాజిగుండ్-బారాముల్లా సెక్షన్ పనులు పూర్తయ్యాయి. Also read:MP High Court: రాఖీ కడితేనే బెయిల్ మంజూరు