Yaas Cyclone landfall: బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను యాస్..తీరాన్ని తాకింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్నాయి. సముద్రంలో అలలు పెద్దఎత్తున ఎగసిపడుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాస్ తుపాను (Yaas Cyclone) భీభత్సం సృష్టిస్తోంది. అతి తీవ్రతుపానుగా మారిన యాస్ తుపాను ఒడిశా రాష్ట్రంలో ధాంగ్రా, బాలాసోర్ మధ్య తీరాన్ని తాకింది. తీరం దాటేందుకు మరో 3-4 గంటల సమయం పట్టవచ్చని ఐఎండీ వెల్లడించింది. యాస్ తుపాను ప్రభావం ఒడిశా, పశ్చమ బెంగాల్ సహా 8 రాష్ట్రాలపై ఉన్నా..అత్యధికంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్(West Bengal) రాష్ట్రాలపైనే ఉంది. భారీ ఈదులుగాలులు, వర్షాలతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. బెంగాల్‌లోని దిగా తీరం వెంబడి భారీగా అలలు ఎగసిపడుతున్నాయి. ఒడిశా(Odisha)లోని భద్రక్ జిల్లాలో పరిస్థితి మరీ ఘోరంగా మారింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో తీరం తాకే ( Landfall process) ప్రక్రియ ప్రారంభమై..పదిన్నర గంటల ప్రాంతంలో తీరాన్ని తాకింది. తీరం వెంబడి సముద్ర అలలు భారీగా విరుచుకుపడుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో గ్రామాల్లోకి సముద్రనీరు చొచ్చుకొస్తోంది. 


Also read: Corona Third Wave: చిన్నారులపైనే ఎక్కువ ప్రభావమా...ఆధారాలున్నాయా లేవా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook