జీ ఇండియా కాన్క్లేవ్: వర్తమాన భారత రాజకీయాలపై చర్చ
భారతదేశ దిగ్గజ మీడియా సంస్థ `జీ` న్యూస్ మారుతున్న భారత్- ఎదుర్కొంటున్న పరిస్థితులు అనే అంశంపై శనివారం (మార్చి 17) జీ ఇండియా కాన్క్లేవ్ను నిర్వహించింది.
న్యూఢిల్లీ: భారతదేశ దిగ్గజ మీడియా సంస్థ 'జీ' మారుతున్న భారత్- ఎదుర్కొంటున్న పరిస్థితులు అనే అంశంపై శనివారం (మార్చి 17) జీ ఇండియా కాన్క్లేవ్ ను నిర్వహించింది. ఈ సమావేశంలో రాజకీయ ప్రముఖులు ఈ అంశంపై మాట్లాడి వారి ఆలోచనలను పంచుకున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భారతదేశం ఎలా మారుతోంది? మార్పులకు ప్రభావితం చేసే కారణాలు ఏమిటి? అనే అంశాలతో పాటు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రస్తుత ప్రభుత్వాల పనితీరుపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తప్పులుంటే ఎండగట్టారు. ఈ విధంగా, వారు జి-నెట్వర్క్ వేదికగా ప్రజల గళాన్ని తెలియజేశారు
భారతీయ జనతా పార్టీ (బీజీపీ) జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ మెగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటి సమావేశం ఉదయం 11 గంటలకు సుబ్రహ్మణ్యం స్వామి మరియు ఎఐఎమ్ఐఎమ్ చీఫ్ అససుద్దీన్ ఒవైసీల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సమావేశంలో ఒవైసీ అయోధ్య వివాదంతో పాటు త్రిపుల్ తలాక్ గురించి కూడా మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ, కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రందీప్ సురేజ్వాలా, నాగాలాండ్ ముఖ్యమంత్రి, మేఘాలయ నెఫ్యూ రియో, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, త్రిపురకు చెందిన బీజేపీ నేత ప్రభారి సునీల్ దేవ్ఘర్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
యూపీ ఆదిత్యనాథ్‌కు ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణాలపై ప్రశ్నిస్తూ.. అలాగే 2019లో కూడా బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారా అని అఖిలేష్ యాదవ్‌ను కూడా ఈ కాన్‌క్లేవ్‌లో ప్రశ్నించారు. త్రిపురలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఏ చర్యలు తీసుకున్నాన్న విషయంపై కూడా ఈ కాన్‌క్లేవ్‌లో చర్చించారు.. సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా #ZeeIndiaConclaveలో మీరు కూడా మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. అలాగే ప్రశ్నలను కూడా అడగవచ్చు.