Zee Digital Tv: దేశంలోనే తొలిసారిగా జీ మీడియా నుంచి నాలుగు దక్షిణాది భాషల్లో డిజిటల్ టీవీ, రేపే ప్రారంభం
Zee Digital Tv: ప్రతిష్ఠాత్మక న్యూస్ మీడియా గ్రూప్ జీ మీడియా మరో వినూత్న ప్రయోగం చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా డిజిటల్ టీవీ ప్రారంభిస్తోంది. ఒకేసారి నాలుగు దక్షిణాది భాషల్లో జీ మీడియా డిజిటల్ టీవీ ప్రసారాలు ప్రారంభం కానున్నాయి.
Zee Digital Tv: ప్రతిష్ఠాత్మక న్యూస్ మీడియా గ్రూప్ జీ మీడియా మరో వినూత్న ప్రయోగం చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా డిజిటల్ టీవీ ప్రారంభిస్తోంది. ఒకేసారి నాలుగు దక్షిణాది భాషల్లో జీ మీడియా డిజిటల్ టీవీ ప్రసారాలు ప్రారంభం కానున్నాయి.
న్యూస్ ప్రపంచంలో ప్రయోగాలు చేయడమే కాదు..విజయం సాధించడంలో జీ మీడియాది అందెవేసిన చేయి. దేశంలోనే తొలి ప్రైవేట్ శాటిలైట్ చానెల్‌గా రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి ప్రారంభమైన జీ మీడియా ప్రస్థానం ముందుకు సాగుతూనే ఉంది. దేశంలో ప్రైవేట్ రంగంలో టీవీ ఛానెళ్ల రాకముందు అందరికీ తెలిసింది కేవలం దూరదర్శన్ మాత్రమే. ప్రైవేట్ శాటిలైట్ ఛానెల్స్‌లో దేశంలో తొలి ప్రైవేట్ టీవీ జీ టీవీ మాత్రమే. దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ ఉన్నది జీ మీడియాకు మాత్రమే. ఇక సోషల్ మీడియా పరంగా చూస్తే 15.4 కోట్ల మంది ఫాలోవర్లు కలిగిన అతిపెద్ద నెట్‌వర్క్ ఇది. శాటిలైట్ ఛానెల్స్ అయితే దేశంలోని ప్రతి రాష్ట్రంలోని ప్రాంతీయ భాషలో ప్రసారాలు జరుగుతున్నాయి. విస్తృతమైన నెట్‌వర్క్, సమర్ధవంతమైన టీమ్ కలిగి ఉండటమే జీ మీడియా బలంగా ఉంది. న్యూస్ మీడియా రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల్ని అలవర్చుకుంటూ..ఎప్పుడూ వినూత్నతను జోడించడం జీ మీడియాకు అలవాటు.
అందుకే జీ గ్రూప్ అంటే ఓ నమ్మకం. ఓ బ్రాండ్. వార్తల్ని ఎప్పటికప్పుడు నిక్కచ్చిగా అందించమే తెలుసు. ఇప్పుడు మరో వినూత్న ప్రయోగంతో ముందుకొస్తోంది. తొలిసారిగా జీ మీడియా డిజిటల్ టీవీ ప్రారంభిస్తోంది. ముఖ్యంగా నాలుగు దక్షిణాది ప్రాంతీయ భాషల్లో జీ న్యూస్ ప్రసారాలు రేపట్నించి అంటే జనవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ముందుగా తెలుగు రాష్ట్రాల కోసం హైదరాబాద్ వేదికగా జీ తెలుగు న్యూస్ డిజిటల్ టీవీ ప్రసారం కానుంది. ఇప్పటికే మొత్తం టీమ్ సిద్ధమైంది.
అటు కన్నడ అభిమానుల కోసం జీ న్యూస్ కన్నడ పేరుతో బెంగళూరు వేదికగా జనవరి 25న డిజిటల్ టీవీ లాంచ్ కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియా సాక్షిగా అప్‌డేట్స్ వెలువడ్డాయి.
ఇక మరో దక్షిణాది భాష తమిళం. తమిళంలో ఇప్పటికే జీ మీడియా పాపులర్‌గా ఉంది. ఇప్పుడు జీ తమిళ్ న్యూస్ పేరుతో డిజిటల్ టీవీ ప్రసారాలు రేపట్నించి ప్రారంభం కానున్నాయి. చెన్నై వేదికగా ప్రారంభం కానున్న తమిళ డిజిటల్ ప్రసారాలకు సంబంధించి సర్వం సిద్ధమైంది.
అటు మరో దక్షిణాది భాష మళయాలం. కేరళ సంప్రదాయాలకు పట్టుగొమ్మగా, కేరళలో న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు అందించేందుకు జీ మళయాలం న్యూస్ పేరుతో డిజిటల్ టీవీ ప్రసారాలు జనవరి 25న అంటే రేపు ప్రారంభం కానున్నాయి.
Also read: Netaji statue: ఇండియాగేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహం ఆవిష్కరణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook