Zika Virus: కేరళలో ఆందోళన రేపుతున్న జికా వైరస్, కొత్తగా మరో ఐదు కేసులు
Zika Virus: కేరళలో కరోనా మహమ్మారికి తోడు జికా వైరస్ వేధిస్తోంది. పెరుగుతున్న జికా వైరస్ కేసులతో రాష్ట్రంలో ఆందోళన నెలకొంది. దోమల నివారణకు ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకుంటోంది.
Zika Virus: కేరళలో కరోనా మహమ్మారికి తోడు జికా వైరస్ వేధిస్తోంది. పెరుగుతున్న జికా వైరస్ కేసులతో రాష్ట్రంలో ఆందోళన నెలకొంది. దోమల నివారణకు ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకుంటోంది.
దేశంలో కరోనా మహమ్మారి(Corona Pandemic) కేసులు తగ్గుముఖం పట్టినా..కేరళలో ఇంకా సంక్రమణ ఆగడం లేదు. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 30 శాతం కేరళ నుంచే వస్తున్నాయి. అందుకే వీకెండ్ కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం.ఇప్పుడు కొత్తగా జికా వైరస్ వెంటాడుతోంది. దోమల ద్వారా వ్యాపించే ఈ వైరస్‌తో జనం ఆందోళన చెందుతున్నారు. ఈ వైరస్‌కు కూడా మందు లేకపోవడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 5 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో జికా వైరస్ కేసుల సంఖ్య 28కు చేరుకుంది.
రాష్ట్రంలోని అనయారా ప్రాంతానికి 3 కిలోమీటర్ల సమీపంలో జికా వైరస్ క్లస్టర్(Zika Virus Cluster)ను గుర్తించారు అధికారులు. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వైరస్ సంక్రమించకుండా దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తిరువనంతపురంలోని ఇతర ప్రాంతాల్లో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామి అధికారులు వెల్లడించారు.ఇళ్లలో గానీ, చుట్టుపక్కల గానీ నీరు నిల్వ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.జికా వైరస్ (Zika Virus)వ్యాప్తి నేపధ్యంలో కేరళ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. అటు కేరళ పొరుగు రాష్ట్రమైన కర్ణాటక(Karnataka)కూడా అప్రమత్తమైంది. జికా వైరస్ బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also read: India Covid-19 cases: ఇండియాలో కొత్తగా రికవరీ కేసుల కంటే కరోనా పాజిటివ్ కేసులు అధికం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook