Zydus Cadilla: త్వరలో మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్, చిన్నపిల్లలపై కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్
Zydus Cadilla: దేశంలో అతి త్వరలోనే మరో దేశీయ వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు మరో వ్యాక్సిన్ సిద్ధమవుతోంది. మిగిలిన వ్యాక్సిన్లకు భిన్నంగా ఉండనుంది.
Zydus Cadilla: దేశంలో అతి త్వరలోనే మరో దేశీయ వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు మరో వ్యాక్సిన్ సిద్ధమవుతోంది. మిగిలిన వ్యాక్సిన్లకు భిన్నంగా ఉండనుంది.
దేశంలో ప్రస్తుతం రెండు రకాల కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. సీరమ్ ఇనిస్టిట్యూట్(Serum institute) ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్(Covishield), భారత్ బయోటెక్(Bharat Biotech) కంపెనీ అభివృద్ధి చేసిన కోవ్యాగ్జిన్. ఇందులో కోవ్యాగ్జిన్ ( Covaxin) పూర్తిగా స్వదేశీ తయారీ. ఇప్పుడు మరో స్వదేశీ వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. ప్రముఖ ఫార్మా స్యూటికల్ కంపెనీ జైడస్ క్యాడిలా..జైకోవ్ డీ పేరుతో కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. మిగిలిన వ్యాక్సిన్లకు ఇది విభిన్నమైంది. ప్లాసిడ్ డీఎన్ఏ వ్యాక్సిన్ ఇది. అన్నీ సవ్యంగా సాగితే జూన్ రెండవ వారంలోగా వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం అనుమతి పొందవచ్చు. దేశంలో ఏ ఇతర వ్యాక్సిన్ చేయనిది జైడస్ క్యాడిలా(Zydus Cadilla) చేస్తోంది.12 నుంచి 18 సంవత్సరాల్లోపు వయస్సున్నవారిపై ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. దాదాపు 8 వందల మందిపై ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి.
Also read: Ramdev Baba: ఐఎంఏకు మరో ఛాలెంజ్ విసిరిన యోగా గురువు రాందేవ్ బాబా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook