Railway Track Blast: మావోయిస్టు కీలక నేత ప్రశాంత్‌ బోస్‌ అలియాస్‌ కిషన్‌దా అరెస్ట్‌కు నిరసనలో భాగంగా.. కొంతమంది మావోలు ఝార్ఖండ్ లో దుశ్చర్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఝార్ఖండ్‌లోని లతేహర్‌, పశ్చిమ సింగ్‌బుమ్‌ జిల్లాల పరిధిలోని రెండు వేర్వేరు చోట్ల రైల్వే ట్రాక్‌లను పేల్చివేశారు. ఇది సీపీఐ (మావోయిస్టు) పార్టీ పనేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో బార్ఖాకానా- గర్హ్వా, హౌరా - మంబయి మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణ తూర్పు రైల్వే (ఎస్‌ఈఆర్‌) చక్రధర్‌పూర్‌ డివిజన్‌ సింగ్‌బుమ్‌ జిల్లా పరిధిలోని లోతాపహార్‌- సోనువా మధ్య రైల్వే ట్రాక్‌ను మావోయిస్టులు పేల్చివేశారు. శుక్రవారం రాత్రి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ట్రాక్‌ ధ్వంసం అవ్వడం వల్ల హౌరా- ముంబయి మధ్య రైళ్లు నిలిచిపోయాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచి ప్రత్యామ్నాయ రైల్వే ట్రాకుల ద్వారా రైళ్ల రాకపోకలు కొనసాగాయి. అయితే రెండుగంటల తర్వాత పూర్తి స్థాయిలో పునరుద్ధరించారు.


తూర్పు మధ్య రైల్వే (ఈసీఆర్‌) పరిధిలోని ధన్‌బాద్‌ డివిజన్‌లోనూ లతేహార్‌ జిల్లాలో రిచుగుటా-డెమూ మధ్య శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 12.30 గంటల సమయంలో మరో ట్రాక్‌ను మావోయిస్టులు పేల్చివేశారు. దీంతో బార్ఖాకానా- గర్హ్వా మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనలో ఓ డీజిల్‌ ఇంజిన్‌ దెబ్బతింది. సుమారు పది గంటల తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనతో పలు రైళ్లను దారి మళ్లించగా.. ఓ స్పెషల్‌ ట్రైన్‌ను రద్దు చేశారు.   


Also Read: ‘ఇమ్రాన్ ఖాన్ నా పెద్దన్న’.. సిద్ధూ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ గంభీర్ ఫైర్


Also Read: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. 10,488 కరోనా కేసులు, 313 మరణాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook