Tips for Waking Up Early: చలి కారణంగా ఉదయం నిద్ర లేవలేక పోతున్నారా? ఇలా చేస్తే టైంకి నిద్రలేస్తారు!
Tips For Getting Up Early In Winter: ప్రస్తుతం చాలామంది చలి కారణంగా ఉదయం పూట తొందరగా నిద్ర లేవలేక పోతున్నారు. దీని కారణంగా చాలామంది మొబైల్స్ లో అలారం సెట్ చేసుకొని మరీ పడుకుంటున్నారు. అయినప్పటికీ నిద్రలేకపోతున్నారు. అయితే ఇలాంటి వారి కోసం మేము కొన్ని చిట్కాలు అందించబోతున్నాం.
Tips For Getting Up Early In Winter: శీతాకాలంలో తెల్లవారి జామున చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో చాలామందికి నిద్ర లేవాలనిపించదు. దీని కారణంగా పిల్లలు పాఠశాలలకు, పెద్దలు ఆఫీసులకు ఆలస్యంగా వెళ్ళవలసి వస్తుంది. అయితే చాలామంది ఉదయాన్నే తొందరగా నిద్ర లేవాలని మొబైల్స్ లో అలారాలు పెట్టుకుంటూ ఉంటారు. ఉదయం అలారం మోగినప్పటికీ లేవ్వలేకపోతుంటారు. అయితే చలికాలంలో మీరు నిజంగానే ఉదయాన్నే నిద్రలేవాలనుకుంటున్నారా? మేము అందించే కొన్ని సులభమైన చిట్కాలను పాటించి సులభంగా మీరు అనుకున్న సమయానికే నిద్ర లేవచ్చు.
ప్రతిరోజు ఈ చిట్కాలను ఫాలో అవ్వండి:
రాత్రి మొబైల్‌ని చూడడం ఆపండి:
శీతాకాలంలో ఉదయాన్నే నిద్రలేవాలనుకునేవారు తప్పకుండా రాత్రి పడుకునే రెండు గంటల ముందే మొబైల్‌ని వినియోగించడం మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చాలామంది రాత్రి 12 గంటల వరకు ల్యాప్‌టాప్స్‌లో మూవీస్ చూస్తూ ఉంటారు. ఇలా చూడడం కూడా మానుకోవాలని వారంటున్నారు. చిట్కా పాటించడం వల్ల మీరు సులభంగా ఉదయాన్నే నిద్ర లేవచ్చు.
అర్థరాత్రి ఏమి తినొద్దు:
ఆధునిక జీవన శైలి కారణంగా చాలామందికి అర్థరాత్రి పూట తినడం ఒక అలవాటుగా మారింది. ముఖ్యంగా శీతాకాలంలో రాత్రి 11 గంటల సమయంలో ఆహార పదార్థాలు తినడం వల్ల ఉదయం నిద్ర లేవడానికి చాలా కష్టం అవుతుంది. అంతేకాకుండా ఉదయం పూట బద్దకంగా ఉంటారు. కాబట్టి శీతాకాలం అర్థరాత్రి పూట ఆహారాలు తీసుకోవడం మానుకోవాలి.
Also read: Tollywood 2023: ఈ ఏడాది లో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోలు.. ఎవరెవరో తెలుసా
ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇలా చేయండి:
చాలామంది శీతాకాలంలో ఉదయం నిద్ర లేచిన తర్వాత బద్ధకంగా ఉంటారు దీని కారణంగా మళ్లీ నిద్రపోతూ ఉంటారు అయితే ఇలా మీరు కూడా చేస్తే ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ గదిలో ఉండే లైట్‌ని ఆన్ చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల లైట్ నుంచి వచ్చే కాంతి నేరుగా మీ కళ్ళపై పడి మీకు మెలకువ వస్తుంది. దీని దీని వల్ల మీరు తొందరగా మేల్కొంటారు.
అలారం పెట్టుకున్న తర్వాత మొబైల్‌ని దూరంగా ఉంచండి:
చాలామంది చలికాలంలో ఉదయం పూట లేచి ఎందుకు మొబైల్ లో అలారం సెట్ చేసుకొని పక్కలో పెట్టుకొని పడుకుంటారు. అయితే అలారం మోగిన తర్వాత చాలామంది ఆఫ్ చేసి మళ్లీ నిద్రపోతున్నారు. కాబట్టి ఇలా నిద్రపోకుండా ఉండడానికి అలారం సెట్ చేసిన తర్వాత ఫోన్ ని దాదాపు నాలుగు అడుగుల దూరంలో ఉంచుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల అలారం మోగిన తర్వాత వెంటనే లేచి ఆఫ్ చేస్తారు. ఈ సమయంలో మీకు మెలకువ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter