Homemade Foot Scrub: ముఖాన్ని మాత్రమే కాదు మన కాళ్లు కూడా అందంగా చూసుకోవాలి. కొందరు వాటిని నిర్లక్ష్యం చేస్తారు. అయితే, కాళ్లు పొడిబారడం జరుగుతుంది. మీ కాళ్లను మృదువుగా మార్చే కొన్ని రెమిడీస్ ఉన్నాయి. ఈ నేచురల్ స్క్రబ్స్ మీ కాళ్లపై ఉన్న డెడ్‌ స్కిన్ ను తొలగించి అందంగా మారుస్తాయి. మీ కాళ్లను ఎక్స్‌ఫోలియేట్‌ చేసి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. కొత్త పునరుజ్జీవనాన్ని అందిస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తేనె స్క్రబ్..
తేనె, చక్కెర సమపాళ్లలో కలిపి మంచి పేస్ట్‌ మాదిరి తయారు చేసుకోవాలి. దీన్ని పాదాలకు గరుకుగా ఉన్న ప్రాంతంలో స్క్రబ్ చేయాలి. దీన్ని ఓ 10 నిమిషాలపాటు మృదువుగా స్క్రబ్ చేసుకుంటూ ఉంటాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజ్ చేస్తుంది. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.


ఆలివ్ ఆయిల్, సముద్రపు ఉప్పు..
ఈ రెండిటిని కలిపి పేస్ట్‌ తయారు చేసుకోవాలి. దీన్ని పాదాలకు స్ర్కబ్ చేసుకోవాలి.  కొద్ది సమయం తర్వాత సర్క్యూలర్ మోషన్లో రుద్దాలి. ఆలివ్ ఆయిల్ కాళ్లను మృదువుగా చేస్తుంది. 


కాఫీ స్క్రబ్..
కాఫీ, కొబ్బరి నూనెను కలిపి పేస్ట్‌ మాదిరి తయారు చేసుకోవాలి. సున్నితంగా ఈ స్క్రబ్ తయారు చేసుకోవాలి. ఇది పాదాలపై ఉన్న డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది. కాఫీ స్క్రబ్‌ వల్ల చర్మానికి ఎక్స్‌ఫోలియేషన్‌ ఇస్తుంది. చర్మాన్ని లోతుగా మృదువుగా మారుస్తుంది. స్క్రబ్‌ చేసుకున్న తర్వాత నార్మల్‌ వాటర్‌ తో వాష్‌ చేయాలి. ఇది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.


ఇదీ చదవండి: Wood Apple Health Benefits: వెలగపండులో వెలకట్టలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..


బేకింగ్‌ సోడా..
బేకింగ్‌ సోడా, నిమ్మరసం రెండు కలిపి పేస్ట్‌ తయారు చేసుకోవాలి. దీన్ని కాళ్లకు స్క్రబ్ చేయాలి. పొడిబారిన ప్రాంతంలో మృదువుగా స్క్రబ్ చేయాలి. నిమ్మరసంలో ఎక్స్‌ఫోలియేట్‌ చేస్తుంది. చర్మకాంతిని మెరుగుపరుస్తుంది. బేకింగ్‌ సోడా చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఈ స్క్రబ్ చర్మానికి హైడ్రేషన్‌ అందిస్తుంది.


ఇదీ చదవండి: మామిడిపండ్లను తినబోయే ముందు నీళ్లలో ఎందుకు  నానబెట్టాలి?


ఎప్సాం సాల్ట్‌..
ఎప్సాం సాల్ట్‌ కొన్ని చుక్కల పెప్పర్మెంట్‌ ఆయిల్ వేయాలి. అందులో బాదం, జోజోబా ఆయిలు కూడా యాడ్‌ చేసి స్క్రబ్ చేయాలి. కాళ్లకు డెడ్ స్కిన్ తొలగిస్తుంది. పెప్పర్మెంట్‌  ఆయిల్ కాళ్లను మృదువుగా చేస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి