Abc Juice Benefits: చలికాలంలో చాలామంది లేజీ నెస్‌గా ఉంటారు. అంతేకాకుండా వ్యాయామాలతో పాటు యోగా చేయడం కూడా మానేస్తారు. అలాగే చలి కారణంగా వాకింగ్ చేయడం కూడా ఆపేస్తారు. ఇలా లేజీగా తయారవడం కారణంగా సులభంగా ఫిట్నెస్ కోల్పోతారు. దీంతో చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమంది అయితే శీతాకాలంలో ఎక్కువగా డీప్ ఫ్రై చేసిన ఆహారాలను తీసుకుంటారు. దీని కారణంగా జీర్ణక్రియ సమస్యల బారిన కూడా పడతారు. అయితే ఈ శీతాకాలంలో ఎలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఆరోగ్య నిపుణులు రకాల పోషకాలు కలిగిన ABC తాగాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఎబిసి జ్యూస్ అంటే మీకు తెలుసా? ఈ జ్యూస్‌ను తాగడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ABC జ్యూస్ అంటే ఏమిటి?:
ప్రస్తుతం చాలామందికి ఏబీసీ జ్యూస్ గురించి తెలియదు. ఏబీసీ జ్యూస్ ను యాపిల్, బీట్‌రూట్, క్యారెట్‌లతో తయారుచేస్తారు. వీటిలో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి.. కాబట్టి ఈ జ్యూస్ని తాగడం వల్ల శీతాకాలంలో వచ్చే అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు అంతేకాకుండా శరీరంలోని రోగ నిరోధక శక్తిని కూడా మెరుగుపరుచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఈ ఏబీసీ జ్యూస్‌ను తాగడం వల్ల శరీరానికి ఇతర లాభాలు కూడా ఉన్నాయి.. అవేంటంటే..


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
యాంటీ ఆక్సిడెంట్లు:
ABC జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి కాబట్టి ఇవి శరీరంలో రాడికల్స్‌తో పోరాడి ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రించేందుకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని వారంటున్నారు.


గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
ఈ ఎబిసి జ్యూస్ ని ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి తగిన పరిమాణంలో పొటాషియం లభిస్తుంది దీని కారణంగా రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది అంతేకాకుండా గుండెపోటు, ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికే అధిక రక్తపోటు గుండెపోటు సమస్యలతో బాధపడేవాడు తప్పకుండా ఈ జ్యూస్‌ని ప్రతిరోజు తాగాలి.


జీర్ణక్రియ సమస్యలకు చెక్:
ఎబిసి జ్యూస్ ను ప్రతి రోజూ తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం అంతేకాకుండా జీర్ణ క్రియ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇందులో ఉండే గుణాలు మలబద్ధకం సమస్యను కూడా సులభంగా దూరం చేస్తాయి. కాబట్టి పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ప్రతిరోజు ఈ జ్యూస్ ని తాగాలి.


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter