Teeth Whitening At Home: దంతాలు తెల్లగా ఉండడానికి చాలామంది వివిధ ప్రోడక్ట్లను వాడుతూ ఉంటారు. దీనికోసం ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉంటారు అయితే ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో మన పళ్ళను తెల్లగా మెరుస్తూ చేసుకోవచ్చు అదే ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దంతాలను తెల్ల‌గా మార్చే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెల్ల‌టి దంతాల‌ కోసం ప్రతిరోజూ కొబ్బ‌రి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల దంతాలు తెల్లగా  కనిపిస్తాయి.


 కొబ్బ‌రి నూనెతో దంతాలు శుభ్రం చేసుకోవడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా న‌శిస్తుంది. 


 దంతాల‌పై మ‌ర‌క‌ల‌ను తొల‌గించ‌డంలో బేకింగ్ సోడా మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంది. 


   బేకింగ్ సోడా  వ‌ల్ల దంతాల‌పై ఉండే మ‌ర‌క‌లు, ప‌సుపుద‌నం తొల‌గిపోయి దంతాలు తెల్ల‌గా మార‌తాయి. 


 దంతాల‌ను తెల్ల‌గా మార్చ‌డంలో యాక్టివేట్ చేసిన బొగ్గు  ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. 


 బొగ్గు  ఉపయోగించడం వల్ల దంతాల‌పై ఉండే మ‌ర‌కలు తొల‌గిపోతాయి.


 దంతాలు తెల్ల‌ ఆవాల నూనె ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. అంతేకాకుండా చిగుళ్ల ఆరోగ్యంగా ఉంటాయి.


Also Read  Cholesterol Reducing Foods: చలికాలంలో కొలెస్ట్రాల్‌ను అంతమొందించే కూరగాయలు ఇవే..


 స్ట్రాబెరీల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం పొందవచ్చు. స్ట్రాబెరీల‌ను పేస్ట్ గా చేసి అందులో బేకింగ్ సోడా క‌లిపి దంతాల‌ను శుభ్రం చేయడం వల్ల దంతాలు శుభ్రం  అవుతాయి.


 కాఫీ, టీ, వంటి వాటిని తీసుకోవ‌డం త‌గ్గించడం వల్ల దంతాలు పచ్చగా మారకుండా ఉంటాయి.


 త్రిఫల కషాయాం నోటిని క్లీన్ చేయడంలో ఏంతో సహాయపడుతుంది. అలాగే నోటి పూతలను తగ్గించడంలో మేలు చేస్తుంది.


 పండ్ల తొక్కలను ఉపయోగించడం వల్ల దంతాలపైన ఉండే పసుపు మ‌ర‌కలు తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది.


 ఆవాల నూనెను చిటికెడు ఉప్పుతో  తీసుకోవడం వల్ల చిగుళ్లపై మసాజ్‌ చేయడం వల్ల పసుపు రంగు పోతుంది. 


 ఉదయం బ్రష్ చేయడమే కాకుండా, భోజనం చేసిన తర్వాతతర్వాత బ్రష్ చేయడం వల్ల తెల్లటి దంతాలను పొందవచ్చు.


 దంతాల రంగును మార్చడంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కీలక పాత్ర పోషిస్తుంది. వారం పాటు దీని తీసుకోవడం ఫలితం లభిస్తుంది.


ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల  సుల‌భంగా దంతాల‌ను  తెల్ల‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also Read  Mosambi: బత్తాయి పండు రసం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter