Mosambi Juice Benefits: బత్తాయి పండు తీసుకోవడం వల్ల ఆరోగ్యనికి ఎంతో మేలు కులుగుతుంది. ముఖ్యంగా ఈ పండు తొక్క, గుజ్జు, గింజలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ బత్తాయి ఇండోనేషియా, చైనాలో ఎక్కువగా లభిస్తుంది.
బత్తాయి పండులో ఎక్కువగా విటమిన్ సి లభిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ఇమ్యునటీ పవర్ పెరుగుతుంది. అయితే ఈ పండుతో వచ్చే రసం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బత్తాయి పండు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బత్తాయి పండు రసం తీసుకోవడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో ఎంతో సహాయపడుతుంది. ఈ పండులో 90 శాతం నీరు ఉంటుంది. ఈ పండులో ఎక్కువగా ఫైబర్, కొవ్వు , పొటాషియం, విటమిన్-సి అధికంగా లభిస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు ఈ పండు తీసుకోవడం చాలా మంచిది. బత్తాయి పండులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతుంది.
బత్తాయి పండు రసం తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ క్రమంగా జరుగుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెంచడంలోను కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యం ఉంచడంలో ఎంతో మేలు చేస్తుంది.
బత్తాయి పండును గర్భిణీలు తీసుకోవడం వల్ల పండులోని క్యాల్షియం కడుపులో పెరిగే బిడ్డకు, తల్లికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా బత్తాయి రసంలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రొసర్టీస్ వల్ల కంటి చూపు మెరుగ కనిపిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బత్తాయిలోని విటమిన్ సి వల్ల శీతాకాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి.
Also read: Cinnamon Milk: దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల కలిగే లాభాలు ఇవే!
బత్తాయి పండు ఒంట్లో వేడిని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. కొంతమంది మూత్రనాళంలో సమస్యల బారిన పండుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే బత్తాయి రసంలో కాస్తంత గ్లూకోజ్ కలుపుకుని తాగడం వల్ల సమస్య తగ్గుతుంది. బత్తాయిలో ఉండే పొటాషియం మీ రక్తపోటును తగ్గిస్తుంది. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుంచి చర్మాన్ని కాపాడతాయి. చుండ్రు సమస్యలకు చికిత్స చేయడానికి కూడా బత్తాయి ఏంతో ఉపయోపడుతుంది.
ఈ విధంగా బత్తాయి పండు తీసుకోవడం వల్ల శరీరాకి ఎంతో మేలు కలుగుతుంది. ప్రతి రోజు బత్తాయి పండు తీసుకోవడం వల్ల శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also read: Camel Milk: ఒంటె పాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter