Gram Flour skin Benefits: శనగపిండి సౌందర్యపరంగా ఎన్నో రోజులుగా ఉపయోగిస్తున్నారు. ఇది ముఖానికి మెరుపుని అందిస్తుంది. అంతేకాదు ఇది ముఖంపై ఉన్న గీతలను, మచ్చలను తొలగించే గుణం దీనిలో ఉంటుంది. ముఖ్యంగా శనగపిండిని స్క్రబ్ లాగా ఉపయోగిస్తారు. ఇది చర్మంపై ఉన్న డెడ్ సెల్స్‌ని తొలగిస్తుంది. స్కిన్ కి ఇన్స్టంట్ గా గ్లోని అందిస్తుంది. అంతేకాదు శనగపిండి మన ముఖానికి లోతుగా శుభ్రపరుస్తుంది. ఇందులో మన స్కిన్ కి కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి జిడ్డు చర్మం ఉన్నవాళ్లు నీళ్లలో శనగపిండిని కలిపి పేస్ట్ మాదిరి తయారుచేసుకొని దీని ముఖానికి స్క్రబ్ చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి వాటి అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాన్ తొలగిస్తుంది..
ఎండాకాలం ముఖంపై ట్యాన్ పేరుకుపోవడం సహజం. ఇది మన ముఖానికి నాచురల్ బ్లీచ్ లాగా పనిచేస్తుంది. ట్యాన్ ఉన్నవాళ్లు శనగపిండిని పాలలో మిక్స్ చేసి కలిపి పేస్ట్ మాదిరి తయారు చేసుకుని ముఖాన్ని స్క్రబ్ చేసుకోవాలి, లేకపోతే పాలు లేదా పెరుగుతో ముఖంపై ప్యాక్ వేసుకోవాలి.


యాక్నేతో పోరాడుతుంది..
శనగపిండి ముఖంపై ఉన్న అదనపు నూనె కూడా తొలగిస్తుంది. చర్మంపై అదనపు ఆయిల్ ఉత్పత్తి కావడం వల్ల యాక్నేపేరుకుంటుంది. శనగపిండి దీనికి చక్కని రేమిడి. శనగపిండి అప్లై చేయడం వల్ల ముఖంపై అధికంగా నూనె ఉత్పత్తిని గ్రహించేస్తుంది. ముఖానికి మెరుపుని ఇస్తుంది.


ఇదీ చదవండి: బాస్కెట్‌ బాల్‌ ఆడితే మన శరీరానికి 7 అద్భుతమైన ప్రయోజనాలు తెలుసా?


చర్మానికి పోషకం..
గత ఎన్నో ఎళ్లుగా మన సౌందర్య ఉత్పత్తుల్లో శనగపిండిని ఉపయోగిస్తున్నారు. మాయిశ్చర్ నిలుపుకుంటుంది. క్రీం లేదా పాలలో శనగపిండిని కలిపి పేస్ట్ మాదిరి తయారు చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.


ఎక్స్‌ఫోలియేట్..
శనగపిండిలో ఎక్స్పాలియేట్ గుణాలు ఉంటాయి. ఇది హానికరమైన కెమికల్స్ ముఖానికి పెట్టుకోవడం వల్ల డామేజ్ అయ్యే అవకాశం ఉంది కానీ శనగపిండితో సహజ సిద్ధంగా మనకు స్క్రబ్ మాదిరి ఉపయోగిస్తారు. డెడ్‌ స్కిన్ సెల్స్ ని తొలగించేసి ముఖానికి గ్లో ఇస్తుంది ఇది అన్ని స్కిన్ టైప్ వాళ్లకి ఉపయోగపడుతుంది.


ఇదీ చదవండి: దానిమ్మతొక్కతో మీ ముఖానికి రెట్టింపు గ్లో.. మచ్చలేని అందం..


యవ్వనం..
శనగపిండిని బ్యూటీ రొటీన్ లో వాడే వారికి యవ్వనంగా కనిపిస్తారు. ఈ ముఖంపై ఉన్న లైన్స్ గీతలను తగ్గించేస్తుంది. ముఖానికి యవ్వనత్వాన్ని అందిస్తుంది శనగపిండి ముఖానికి అప్లై చేయడం వల్ల వృద్ధాప్యం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ రాకుండా నివారిస్తాయి. మీ డైలీ రొటీన్ లో శనగపిండిని ఉపయోగించడం వల్ల మీరు యవ్వనంగా కనిపిస్తారు వృద్ధాప్యం ఆలస్యం అవుతుంది అంతేకాదు ముఖంపై ఉన్న లైన్స్ గీతాలు తొలిగిపోతాయి మీ ముఖం రెండింతల రెట్టింపు వస్తుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter