Weight Gain Foods:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువుతగ్గాలని మాత్రమే కాదు.. బరువు పెరగాలని కూడా చాలామంది ప్రయత్నాలు.. చేస్తూ ఉంటారు. బరువుతగ్గడం కంటే బరువుపెరగడం చాలా సులువు అని.. ఏది పడితే అది తినేస్తే లావైపోతారు.. అని అనుకుంటూ ఉంటారు. కానీ పౌష్టిక ఆహారంతో లావైనప్పుడు.. మాత్రమే ఆరోగ్యంగా ఉంటారు. మంచిది కాని ఆహారంతో బరువు పెరిగినా కూడా.. అది ఆరోగ్యానికి హానికరంగానే మారుతుంది. 


మరి కొంతమంది బరువుపెరగడం కోసం టాబ్లెట్లు కూడా వాడుతూ ఉంటారు. కానీ అలాంటి టాబ్లెట్ల వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కేవలం మంచి ఆహారం తీసుకుని కూడా బరువుపెరగొచ్చు. బరువు పెరగడం కోసం మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి చూద్దాం.


పౌష్టిక ఆహారం


బరువు పెరగాలన్న తగ్గాలన్నా కూడా మనం తీసుకునే ఆహారం అన్ని పోషకాలతో.. కలిగినది అయ్యుండాలి. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అని దాని మీదనే.. మన బరువు ఆధారపడి ఉంటుంది. మనం తినే ప్రతి ఆహార పదార్ధం మన బరువుని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆరోగ్యకరంగా బరువు పెరగాలని కూడా మంచి పోషకాలు ఉన్న డైట్ తీసుకోవడం చాలా ముఖ్యం.


రెడ్ మీట్:


రెడ్ మీట్ లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానిని తినడం వల్ల ..త్వరగా బరువు పెరగవచ్చు. అంతేకాకుండా రెడ్ మీట్ లో ఉండే ఐరన్, ప్రోటీన్స్.. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడం మాత్రమే కాక..మంచి ఫ్యాట్ అందిస్తాయి.


ఫుల్ క్రీమ్ మిల్క్:


బరువుపెరగాలి అనుకునేవాళ్లు పాలని కూడా డైట్ లో చేర్చాల్సి ఉంటుంది. లో ఫాట్ స్కిమ్డ్ మిల్క్ తో పోలిస్తే ఫుల్ క్రీమ్ మిల్క్ లో.. 60 అదనపు క్యాలరీలు ఉంటాయి. ఓట్స్, హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం వల్ల కూడా త్వరగా బరువు పెరుగుతారు.


పీనట్ బటర్:


కొవ్వుతో పాటు పీనట్ బటర్ లో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల.. సహజంగానే బరువు పెరుగుతారు. ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్‌ లో 100 కేలరీలు ఉంటాయి. అంతే కాకుండా అందులో ఉండే మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి ఆరోగ్యంగా బరువు పెరగడానికి ఉపయోగపడతాయి.


పెరుగన్నం..అరటిపండు:


ఇటువంటి సమస్యలకైనా పెరుగన్నం దివ్య ఔషధం. పెరుగన్నంతో పాటు ఒక అరటిపండు తిన్నా కూడా.. బరువు పెరుగుతారు అని పెద్దలు ఎప్పటినుంచో చెబుతున్న మాటే. 


పండ్లు


మామిడిపండు, అరటి పళ్ళు, బొప్పాయి, పైనాపిల్ ఇలాంటి పండ్లలో.. సహజంగానే చక్కర ఉంటుంది. బరువు పెరగడానికి పండ్లు తినడం మంచి విధానం. పండ్లు తినడం వల్ల పొట్ట నిండుగా ఉండటం మాత్రమే కాక, శక్తి కూడా వస్తుంది. అంతేకాకుండా పండ్ల వల్ల బరువు కూడా పెరగవచ్చు.


అవకాడో:


అవకాడోలో 140 క్యాలరీలు ఉంటాయి. క్యాలరీలతో పాటు అవకాడోలో విటమిన్ ఈ, పోలిక్ యాసిడ్, పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తాయి. సాలడ్స్, స్మూతీ లలో అవతాడోని చెత్త చేయడం వల్ల టేస్ట్ కు తో పాటు బరువు కూడా పెరగవచ్చు.


Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..


Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter