Anti Ageing Tips: మీ జీవనశైలిలో కొన్ని మార్పులతో ఏజీయింగ్ దూరం, నిత్య యవ్వనం మీ సొంతం
Ageing Process: వయస్సుతో వచ్చే వృద్ధాప్య ఛాయలు సహజ పరిణామమే. కానీ ఆహారపు అలవాట్లు, లైఫ్‌స్టైల్ కొద్దిగా మార్చుకుంటే వృద్దాప్య చాయల్ని దూరం చేయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ముసలితనం అనేది వయస్సుకే కానీ మనస్సుకు కాదంటారు. కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే వయస్సుకు కూడా ముసలితనం రాదు. వయస్సు ఐదారు పదులు దాటినా యవ్వనంగా కన్పించవచ్చు.
వయస్సు పెరిగే కొద్దీ సహజంగానే ముసలితనం ఛాయలు కన్పిస్తుంటాయి. ఇటీవలి కాలంలో తక్కువ వయస్సుకే ఆ పరిస్థితి ఎదురౌతుంది. అంటే 30-40 ఏళ్లకే వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తున్నాయి. ఇదంతా మనం నిత్య జీవితంలో చేసే తప్పుల కారణంగానే వస్తున్నాయి. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి వంటివి ప్రధాన కారణాలు. అందుకే కొన్ని సులభమైన మార్పులతో ఈ పరిస్థితి నుంచి గట్టెక్కవచ్చు.
బ్లూ స్క్రీన్స్‌కు దూరంగా ఉండాలి. అంటే మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ వంటివాటికి మీ కళ్లను దూరంగా ఉంచాలి. లేదా సాధ్యమైనంతవరకూ తగ్గించుకోవాలి. ఎందుకంటే వీటిలో ఉండే బ్లూ లైట్ కంటికి మంచిది కాదు. 2019లో ప్రచురితమైన ఏజింగ్ అండ్ మెకానిజమ్స్ ఆఫ్ డిసీజ్ జర్నల్‌లో ఈ విషయాలున్నాయి. ఎక్కువ సేపు బ్లూ స్క్రీన్స్ చూడటం వల్ల మెదడు, కళ్లలోని కణాలు దెబ్బతింటాయని తెలుస్తోంది.
చర్మ సంరక్షణకు ప్రత్యేక పద్ధతులు పాటించాలి. ఇందులో ప్రధానమైంది ముఖానికి మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ వల్ల చర్మంలో నీటిశాతం పెరిగి..చర్మం కాంతివంతంగా మారుతుంది. అందుకే మాయిశ్చరైజర్ అలవాటు చేసుకుంటే మంచిది. దీంతోపాటు సరైన నిద్ర కూడా మనిషికి చాలా అవసరం. రోజుకు 7-8 గంటల నిద్ర తప్పకుండా ఉండాలి.
చెడు అలవాట్లున్నవారికి వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి. ముఖ్యంగా ఆల్కహాల్ అలవాటు మంచిది కాదు. ఎందుకంటే ఆల్కహాల్ అనేది చర్మాన్ని పూర్తిగా డీహైడ్రేట్ చేసేస్తుంది. ముడతలు, ఎర్రగా మారడం, కళ్లు వాసినట్లుంటడటం ప్రధానమైన సమస్యలు. కేన్సర్, హార్ట్ డిసీజ్ తగ్గించుకోవాలంటే మోతాదుకు మించి తాగకపోవడమే మంచిది.
Also read: Winter Precautions: చలికాలం వస్తోంది జాగ్రత్త, గొంతు సమస్యలు, ఎలర్జీకి సులభమైన చిట్కాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook