Turmeric Honey Mixture For Face Shining: మనిషి అందంగా కనబడేందుకు శరీర ఆకృతితో పాటు ముఖం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖం మంచి మెరుపును కలిగి ఉంటే మనిషి ఎప్పుడు అందంగానే కనిపిస్తూ ఉంటాడు. ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో ముఖంపై మొటిమలు నల్ల మచ్చలు వస్తున్నాయి. దీని కారణంగా చాలామంది తమ అందాన్ని కోల్పోతున్నారు. అయితే ముఖాన్ని మెరిపించుకునేందుకు చాలామంది మార్కెట్లో లభించే రకరకాల రసాయనాలతో కూడిన ఫేస్ క్రీమ్ లను వినియోగిస్తూ ఉంటారు. వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్తులో చాలా రకాల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. వీటికి బదులు ఇంట్లో లభించే సాధారణ పదార్థాలతో కూడా సులభంగా మొటిమల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో తయారు చేసిన మిశ్రమాన్ని ప్రతిరోజు వినియోగించడం వల్ల మొటిమలు తగ్గిపోయి.. చర్మం మిగుతగా కూడా తయారయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా స్కిన్ సమస్యలతో బాధపడేవారు దీనిని వినియోగించడం వల్ల ఊహించని ఫలితాలు పొందవచ్చు. ఇంతకీ ఈ చిట్కా ఏంటో? ఇంట్లో లభించే పదార్థాలతో ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో? మనం ఇప్పుడు తెలుసుకుందాం..


Also Read: Pakistan Bad Fielding Video: యు ఫన్నీ.. సింపుల్ రనౌట్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్లు.. ఇలా ఉన్నారంటేరయ్యా..!  


పసుపులో ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి చాలామంది పసుపును ఔషధంగా భావించి ఆహారాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. అయితే ఇది శరీరానికే కాకుండా ముఖానికి కూడా ప్రభావంతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని ప్రతిరోజు ముఖానికి అప్లై చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ముఖంపై మచ్చలను తొలగించడమే కాకుండా ముఖాన్ని అందంగా చేసేందుకు ప్రభావంతంగా కృషి చేస్తాయి.


మిశ్రమం తయారీ పద్ధతి:
పసుపు తేనె మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా చిన్న కప్పు పసుపును తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పసుపును మరొక తప్పులో వేసుకొని అందులోనే అరకప్పు తేనెను కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు పక్కన పెట్టి వినియోగించవచ్చు. దీనిని వినియోగించే ముందు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ మిశ్రమాన్ని వినియోగించాలనుకునేవారు ముందుగా ముఖాన్ని మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని మంచినీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.


Also Read: Pakistan Bad Fielding Video: యు ఫన్నీ.. సింపుల్ రనౌట్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్లు.. ఇలా ఉన్నారంటేరయ్యా..!  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి