Processed Foods Cause Disease: నేటి కాలంలో వేగవంతమైన జీవనశైలి కారణంగా చాలా మంది ప్రజలు అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని  ఆధారపడుతున్నారు. ఈ ఆహారాలు తినడం వల్ల కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ  ప్రాసెసింగ్ ఫుడ్ ని ఎక్కువగా తింటున్నారు. దీని వల్ల అనారోగ్యసమస్యల బారిన పడుతున్నారు. అయితే అతిగా ఈ ప్రాసెసింగ్‌ ఫుడ్ తీసుకోవడవం వల్ల కలిగే అనారోగ్య సమస్యల ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఊబకాయం: 


అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు సాధారణంగా కేలరీలు, కొవ్వు , చక్కెర అధికంగా ఉండి, ప్రోటీన్ , ఫైబర్ తక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి, ఊబకాయానికి దోహదపడతాయి.


గుండె సంబంధ వ్యాధులు:


అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉండే అధిక కొవ్వూ, చెడు కొలెస్ట్రాల్ రక్త నాళాలలో కొవ్వు పదార్థాలు  చేసుకుని, గుండె జబ్బులు  రావడానికి ప్రమాదం పెంచుతుంది.


మధుమేహం:


అధిక చక్కెరలు కలిగిన పానీయాలు ఆహారాలు రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచి, మధుమేహానికి దోహదం చేస్తాయి .


ఎగుడుపడు: 


అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలలో సహజ పోషకాలు తక్కువగా ఉంటాయి. చక్కెర ఎక్కువగా ఉంటుంది, ఇది రక్తంలోని చక్కెర స్థాయిలలో హెచ్చు తగ్గులు  కలిగించి, ఎగుడుపాటుకు దారితీస్తుంది.


క్యాన్సర్:


కొన్ని అధ్యయనాలు అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని సూచిస్తున్నాయి 


కొన్ని అధ్యయనాలు అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయని సూచిస్తున్నాయి. అయితే ఇంకా ఎక్కువ పరిశోధనలు అవసరం.


మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి  తాజా పండ్లు , కూరగాయలు , పప్పు దినుసులు  వంటి అహారాలను ఎక్కువగా తీసుకోవడంముఖ్యం .


ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, తాజా పండ్లు, కూరగాయలు, గ్రెయిన్స్  ఇంట్లో తయారు చేసిన ఆహారాలను ఎక్కువగా తినడం మంచిది . దీని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. పిల్లలకు పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు ఇవ్వడం ఎంతో ఉత్తమం అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also Read: Jaggery Tea: బెల్లం టీ ఆరోగ్య ప్రయోజనాలు తెలుస్తే మహిళలు ఖచ్చితంగా ఇదే తీసుకుంటారు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter