Snacking in Bed:  సాధారణంగా మనందరికీ బెడ్ పై ఎక్కువ సమయం సేదతీరే అలవాటు ఉంటుంది. ఏదైనా స్నాక్ ఒక్కోసారి భోజనం కూడా బెడ్ పై కూర్చొని తింటారు. ఇది పైకి చూడటానికి హాయినిచ్చినా.. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.మంచంపై కూర్చొని తినడం వల్ల చాలా ప్రమాదం. మనం ఏం తింటున్నామో ఎంత ముఖ్యమో.. ఎక్కడ కూర్చొని తింటున్నామో కూడా అంతే ముఖ్యం. మీరు కూడా ప్రతిరోజూ బెడ్ పై కూర్చొని తింటే ఈ అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెడ్ పై ఎందుకు తినకూడదు..
జీర్ణసమస్యలు..
ప్రతిరోజూ బెడ్ పై కూర్చొని తింటే జీర్ణసమస్యలు వస్తాయి. తిన్న వెంటనే బెడ్ పై పడుకోవాలనిపిస్తుంది. లేదా తినే పొజిషన్ కూడా పడుకొని, ఇటూ అటూ ఒకవైపుగా ఒరిగి తింటాం. ఇది యాసిడ్ రిఫ్లక్షన్ కు దారితీస్తుంది. అందుకే మంజి జీర్ణ ఆరోగ్యానికి కుర్చీపైన కూర్చొని తినండి. నేలపై కూర్చొని తింటే మరీ మంచిది.


ఇదీ చదవండి: Pimples Home Remedies : మొటిమ‌లు, మచ్చ‌ల‌ను పోగొట్టే టిప్స్‌ ఇవే తప్పకుండా ఇలా చేయండి!


ఎంత తింటున్నాం?..
సాధారణంగా బెడ్ పై కూర్చొని తింటున్నాం అంటే మనం టీవీ లేదా ఫోన్ లేదా ఏదైనా మూవీస్ ఆన్‌లైన్లో చూస్తాం.  ఈ సందర్భంలో మనం ఎక్కువ తింటున్నామా? లేదా తక్కువ తింటున్నామా? అనేది మన మెదడుకు అర్థం కాదు. ఇది మీ శరీరంపై ప్రభావం చూపుతుంది.


అలెర్జీ..
మీ చుట్టూ ఉన్న ప్రాంతం శుభ్రంగా లేకపోతే అలెర్జీ సమస్యలు వస్తాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొవడం వల్ల మన శారీరకంగా, మానసికంగా కూడా హెల్తీగా ఉంటాం. ఇలా ఆకస్మత్తుగా మార్చుకోవడం కాస్త కష్టమే. కానీ, ప్రతిరోజూ దీన్ని ఓ అలవాటుగా చేసుకుంటే సాధ్యమే. మంచి జీర్ణ ఆరోగ్యానికి టేబుల్ లేదా చైర్ పై కూర్చొని తినాలి. నిద్రలేమి సమస్యలు కూడా మీ దరిచేరవు. 


ఇదీ చదవండి: Get Rid Of Dandruff: చుండ్రు నుంచి శాశ్వతంగా ఉపశమనం కలిగించే వంటింటి చిట్కాలు!


నిద్రలేమి..
బెడ్ పై కూర్చొని తింటే అక్కడ మరకలు, లేదా తిన్న ఫుడ్ దానిపై ఏదో మూల కచ్చితంగా పడుతుంది. ఇది నిద్రలేమి సమస్యలకు దారితీస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు పడుకునే ముందు పరిసర ప్రాంతం శుభ్రంగా ఉండాలి. అప్పుడే హాయిగా నిద్రపడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter