Find Fake Black Pepper: మిరియాలు తరతరాలుగా మన పూర్వీకుల కాలం నుంచి మన వంటల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఆయుర్వేదంలో కూడా మిరియాలది ప్రత్యేక స్థానం. దీని నుంచి వచ్చే అరోమా, ఘాటు ఇంటి వైద్యంలో కూడా వాడతాం. మిరియాల శాస్త్రీయ నామం పిపర్ నిగ్రమ్ దీన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ వంటల్లో వాడతారు. ఇందులో కావాల్సిన పోషకాలు ఉంటాయి. అయితే, ప్రస్తుత కాలంలో అన్నీ ఆహారాలను కల్తీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. మీ ఇంట్లో మీరు వాడుతున్న మిరియాలు అసలైనవా? కల్తీవా? ఎలా గుర్తించాలో FSSAI కొన్ని టిప్స్‌ను షేర్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా విస్త్రతంగా మిరియాలను ఉపయోగిస్తారు.దీని సువాసన, ఘాటు ఎంతో అద్భుతంగా ఉంటుంది. అయితే, మిరియాలను బొప్పాయి గింజలు లేదా  డ్రై బెర్రీలతో కల్తీ చేస్తున్నారు. నల్లమిరియాల శాస్త్రీయ నామం పిపర్ నిగ్రమ్ పెప్పరిసియా జాతికి చెందింది. ఎండకు ఇవి నేచురల్ గా ఎండిపోతాయి. వీటిలో మెడిసినల్ లక్షణాలు ఉంటాయి.


నల్లమిరియాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెగ్నిషియం, విటమిన్ కే, ఐరన్, డైటరీ ఫైబర్ ఉంటాయి.బయోయాక్టివ్ సమ్మేళనాలకు పవర్ హౌజ్. ఇందులో యాంటి ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమెటరీ లక్షణాలు ఉంటాయి. 


ఇదీ చదవండి: పైనాపిల్ హల్వా ట్రై చేశారా ఎప్పుడైనా.. అయితే ఈ విధంగా తయారు చేసుకోండి!


నల్లమిరియాల కల్తీని గుర్తించడం ఎలా?
నల్లమిరియాల్లో అరోమా, రుచి ఆధారంగా గుర్తించవచ్చు. అందుకే మీరు కొనుగోలు చేసేటప్పుడు డార్క్ బ్రౌన్ నల్లమిరియాలు రంగు ఉంటుంది. నిజమైన బ్లాక్ పెప్పర్ వాసన కూడా ఘాటుగా ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం కల్తీ ఆహారం తీసుకుంటే హార్ట్‌ ఫెయిల్యూర్, లివర్ సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడాల్సి ఉంటుంది.


కల్తీ మిరియాలను గుర్తించే విధానం..
కొన్ని మిరియాలను తీసుకుని ఓ టేబుల్ పై ఉంచండి.
మీ వేళ్లతో వాటిని నొక్కండి
అసలైన మిరియాలు అస్సలు పగలవు.


ఇదీ చదవండి:  ఈ కొరియన్ టీలు తీసుకోవడం వల్ల బరువు సులువుగా తగ్గుతారు..
ఒకవేళ అవి కల్తీ మిరియాలు అయితే, సులభంగా విరిగిపోతాయి. ఎందుకంటే మిరియాలకు బదులుగా బ్లాక్ బెర్రీలను కొన్ని అందులో కలుపుతారు. ఇలా మిరియాల కల్తీని ఇంట్లోనే గుర్తించి జాగ్రత్త పడండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter