Bad Cholesterol: అశ్వగంధతో చెడు కొలెస్ట్రాల్ తగ్గడమేకాకుండా.. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్..
Ashwagandha Powder For Bad Cholesterol: ప్రస్తుతం చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఆయుర్వేద చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలే అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Ashwagandha Powder For Bad Cholesterol: ఆయుర్వేదం ప్రాచీనా కాలం నుంచి వచ్చిన గొప్ప వైద్యం. ఆయుర్వేదంలో వుండే విశిష్టమైన ఔషధ గుణాలు, అద్భుతమైన మూలికల రాహస్యాలు గురించి చెప్పే గొప్ప వైద్యం ఇది. అయితే ఆయుర్వేదంలో వుండే మూలికల వల్ల ఎన్నొ ఉపయోగాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. కింగ్ ఆఫ్ ఆయుర్వేదగా పేరు పొందిన మూలిక అశ్వగంధ మొక్క అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ఒత్తిడితో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల వచ్చే అధిక రక్త పోటు సమస్యలకు ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు ఇతర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.దీనిని వినియోగించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇన్ సొమ్నియా:
నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నవారికి అశ్వగంధ మంచి ఔషధంగా పని చేస్తుంది. గోరువెచ్చని పాలలో అశ్వగంధ చూర్ణం కలిపి తాగుతే మంచి ఫలితాలు పొందుతారు.
అధిక ఒత్తిడి:
ఎక్కవ శారీరక, మానసిక ఒత్తిడి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి అశ్వగంధ ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కీళ్ల నొప్పులు:
ప్రస్తుతం చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి అశ్వగంధ సహాయపడుతుంది.
జలుబు, దగ్గు:
శీతాకాలంలో తరుచుగా జలుబు, దగ్గు బారిన పడేవారికి అశ్వగంధ చూర్ణం తీసుకోవడం వల్ల దీర్ఘకాల ఉపశమనం లభిస్తుంది.
ఇమ్యూనిటీ:
కరోనా కారణంగా చాలా మంది ఇమ్యూనిటీ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు అశ్వగంధ పొడిలో పటిక బెల్లం పొడి కలిపి పాలలో కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
నెలసరి సమస్యలు:
ఇటివల కాలంలో మహిళలలో, యువతుల్లో నెలసరి సమయంలో అధిక రక్తస్రావం కావడం సమస్యగా మారింది. ఈ సమస్యకు అశ్వగంధ చూర్ణం, పటిక బెల్లం మంచి ఔషధంగా పని చేస్తుంది. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
బ్రెయిన్ చురుగ్గా పని చేస్తుంది:
జ్ఞాపకశక్తి తక్కువగావున్నా వారు ప్రతి రోజూ ఉదయం ఒక చెంచా అశ్వగంధ ఉపయోగించడం వల్ల బ్రెయిన్ చురుగ్గా మారుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు కూడా దూరమవుతాయి.
చెడు కొలెస్ట్రాల్:
వివిధ రకాల ఆహారాలు అతిగా తినడం వల్ల చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి. దీని వల్ల కొందరిలో గుండెపోటు సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా అశ్వగంధ తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Butta Bomma Movie Review: అనిఖా సురేంద్రన్- అర్జున్ దాస్ 'బుట్టబొమ్మ' రివ్యూ... హిట్ కొట్టారా?
Also Read: NTR 30 Update : డెడ్ లైన్ పెట్టిన ఎన్టీఆర్.. సిద్దంగా ఉన్న కొరటాల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి