Atukula Spring Dosa: అటుకులతో వివిధ రకాల రెసిపీలను తయారు చేసుకుంటారు చాలామంది దీనితో లెమన్ పోహా తయారు చేసుకుంటే మరి కొంతమంది అయితే వీటిని వినియోగించి వివిధ రకాల స్నాక్స్ ని తయారు చేసుకుంటారు. ఇందులో శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లతో పాటు ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.. కాబట్టి రోజూ తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే అటుకులతో నార్త్ లో ఎక్కువగా దోసలు కూడా తయారు చేసుకుంటారు. వీటిని దోషలను తయారు చేసుకోవడం ఎంతో సులభం. అటుకులతో తయారుచేసిన దోసలు స్పందిల్లా వస్తాయి. అంతేకాకుండా అవ్వ తాతలకు పళ్ళు లేని వారికి ఈ దోసలు అద్భుత ప్రయోజనాలను అందిస్తాయి. అటుకులను వినియోగించి మీరు కూడా దోషులను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఇప్పుడే ట్రై చేయండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అటుకుల దోషకు కావలసిన పదార్థాలు:
అటుకులు (పోహా) - 1 కప్పు
ఒక కప్పు మినపపప్పు
పెరుగు - 1/2 కప్పు
ఉల్లిపాయ - 1 (తరగ తరగ)
కారం - రుచికి సరిపోతుంది
ఉప్పు - రుచికి సరిపోతుంది
కొత్తిమీర - కొద్దిగా (తరిగి)
నూనె - వేయడానికి తగినంత


తయారీ విధానం:
ఈ దోషాలను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది అందులో మినప్పప్పు వేసుకొని దాదాపు నాలుగు నుంచి ఐదు గంటలసేపు బాగా నాననివ్వండి. 
బాగా నానిన మినప్పప్పును గ్రైండర్ లో వేసుకొని బాగా రుబ్బుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరో బౌల్ తీసుకొని అందులో అటుకులను వేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా నాన్నని ఇవ్వాలి. 
ఇలా బాగా నానిన అటుకులను మిశ్రమంలో తయారు చేసుకున్న పిండి జారులోనే వీటిని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. 
ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, కారం, ఉప్పు, తగినంత పెరుగు వేసుకొని మరికొద్దిసేపు గ్రైండ్ చేసుకోండి. 
బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కావలసిన నీటిని వేసుకొని మరోసారి బాగా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్న పిండిని తీసి పక్కన పెట్టుకోవాలి. 
ఆ తర్వాత స్టవ్ పై నాన్ స్టిక్ పెనం పెట్టుకొని దానిపై సన్నంగా దోసను వేసుకోండి. ఇలా వేసుకున్న దోశ రెండు వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కాలనీవ్వండి.
గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పైనుంచి నెయ్యి వేసుకొని మరో ఒక్క నిమిషం పాటు అటు ఇటు బాగా వేయించుకొని పక్కన తీసుకొని సర్వ్ చేసుకోండి.


Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  


చిట్కాలు: 
దోశలు మృదువుగా రావడానికి తప్పకుండా అటుకులను కనీసం 15 నిమిషాల పాటు అయినా బాగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. 
దోశల పిండి పెనంపై వేసే క్రమంలో తక్కువ ఫ్లేమ్ లోనే కాల్చుకుంటే చాలా మంచిది. ఇలా కాల్చుకుంటే లోపల బాగా ఉడికి స్పాంజీగా వస్తాయి. 
అటుకుల దోషనే కాకుండా ఇదే తరహాలో క్యారెట్, బీట్రూట్ దోశలు కూడా వేసుకోవచ్చు.


Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.