Auto Driver Hijra Marriage: ప్రేమ గుడ్డిది అని సరదాకి అంటారు అనుకుంటాం కానీ ఒక్కోసారి అది నిజమే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రేమకి కులం, మతం అనే తేడా లేదు. అయితే ఈ ప్రేమ ఆడ, మగ మధ్య అయితే ఫర్వాలేదు కానీ ఒక పురుషుడు మరో ట్రాన్స్ జెండర్ మధ్య అయితే? వినడానికి కాస్త వింతగా ఉన్నా అది నిజమే. మీరు చదవబోయే ఎపిసోడ్‌లో అన్ని బంధాలు, సాంఘిక సంప్రదాయాలను బద్దలు కొట్టి ఓ ఆటో డ్రైవర్ ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకున్నాడు. దైవ సాక్షిగా గుడిలో ట్రాన్స్ జెండర్ తో ఏడు అడుగులు వేసి తన ప్రేమను చాటుకుంటూ సమాజానికి ఆదర్శంగా నిలిచారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక ట్రాన్స్ జెండర్ ఇంత ఘనంగా పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఈ అపూర్వ వివాహానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం, ఆటోడ్రైవర్ ట్రాన్స్ జెండర్ ని వివాహం చేసుకున్నందుకు అతని కుటుంబ సభ్యులు కలత చెందుతున్నారు. నిజానికి ఈ మొత్తం వ్యవహారం ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలోని పడవ్ ప్రాంతంలో జరిగింది. ఆటో డ్రైవర్ అభిషేక్ అదే ప్రాంతంలో నివసించే ఛోటీ అనే ట్రాన్స్ జెండర్ తో ప్రేమలో పడ్డాడు. ఛోటీని చూడగానే అభిషేక్ మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడు.


ఛోటీని చూసేందుకు గంటల తరబడి ఆటోను బస్టాండ్‌లో పార్క్ చేసేవాడట, ఛోటీ కూడా అదే బస్టాండ్ లోనే ఎక్కువగా ఉండేవాడు. అలా వారిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ముందు ఒకరినొకరు చూసుకోవడం వరకే పరిమితం అయినా ఒకరోజు ఇద్దరూ తమ మనసులోని మాటను ఒకరికొకరు చెప్పుకుని తమ ప్రేమను వ్యక్త పరుచుకున్నారు.


ఆ తర్వాత ఇద్దరూ కలిసి లివ్ ఇన్ లో ఉండడం ప్రారంభించారు. కానీ వారి గురించిన విషయాలు వెలుగులోకి రావడంతో అభిషేక్ కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కానీ మతం, సమాజం అలాగే కుటుంబంతో సంబంధం లేకుండా, ఇద్దరూ గుడికి వెళ్లి వివాహం చేసుకుని చివరికి ఒకటయ్యారు. వీరి పెళ్లి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది, ఇందులో అభిషేక్ పసుపు బట్టలు ధరించి, ఉండగా ఛోటీ నలుపు చీరలో కనిపిస్తున్నారు. ఇద్దరూ ఒకరికొకరు దండలు వేసుకుని చాలా సంతోషంగా ఉన్నారు.
Also Read: Ration Card Aadhar Link Deadline: రేషన్ కార్డు-ఆధార్ లింక్ చేయలేదా.. అయితే నో టెన్షన్.. ఇలా చేసేయండి!


Also Read: Thaman Copy Tune: శంకర్ ను కూడా మోసం చేసిన తమన్.. ట్యూన్ అక్కడి నుంచి తెచ్చాడా?



 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook