Bad Cholesterol: బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడానికి ఈ 4 ఆహార పదార్థాలు చాలు..
How To Reduce Bad Cholesterol In 7 Days: కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ వీటిని ఆహారంలో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
How To Reduce Bad Cholesterol In 7 Days: శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల ప్రాణాంతక వ్యాధులు బారి పడుతున్నారు. ముఖ్యంగా ఇది పెరగడం వల్ల చాలా మంది గుండె సమస్యల బారిన పడుతున్నారు. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకోవడం వల్ల గుండెలోని సిరల్లో కూడా కొలెస్ట్రాల్ కుంచించుకుపోతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా రక్త ప్రసరణ కూడా వస్తున్నాయి. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడానికి తప్పకుండా ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల ఆహారాలను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
వీటిని తప్పకుండా ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది:
ఎండుద్రాక్ష:
ఎండుద్రాక్షలో కార్బోహైడ్రేట్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం లభించి ఎముకలను దృఢంగా చేస్తుంది. అంతేకాకుండా ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ఎండుద్రక్షల్లో ఫైటోకెమికల్స్,ఫ్లేవనాయిడ్స్ అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి శరీరంలోని కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రిస్తుంది.
మెంతులు:
మెంతికూరలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను సులభంగా తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్‌లు, రిబోఫ్లావిన్ వంటి పోషకాల అధికంగా లభిస్తాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
బాదం:
బాదంపప్పులో కూడా విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఖళీ కడుపుతో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా సులభంగా నియంత్రిస్తాయి.
అవిసె గింజలు:
అవిసె గింజల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా గుండె సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Also Read: Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్
Also Read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి