Banana Leaves Benefits: పండ్లు, కూరగాయలలు ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతాయి. వీటిని తీసుకోవడం వల్ల అనేక పోషకాలు మనకు లభిస్తాయి. అయితే పండ్లులో అరటి పండు ఒకటి. దీని తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ఫలితాలు కలుగుతాయని ఆరోగ్యానిపుణులు చెబుతుంటారు. అయితే పండు మాత్రమే కాకుండా అరటి పువ్వుతో మనం ఆరోగ్య లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.  దీని వల్ల బాడీకి కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరటి పువ్వు భారతదేశంలో విస్తృతంగా లభిస్తుంది. ఈ అరటి పువ్వులో పోషకాల సమృద్ధి కలిగినది  అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.అరటి పువ్వు, అరటి చెట్టు పుష్ప భాగం, భారతదేశం అలాగే ఇతర దక్షిణాసియా దేశాలలో ఒక ప్రసిద్ధ ఆహార పదార్థం. దీనిని వివిధ రకాల వంటకాలలో ఉపయోగిస్తారు, వీటిలో కూరలు, సలాడ్లు, పచ్చళ్ళు మరియు అప్పడాలు ఉన్నాయి. అరటి పువ్వు రుచికరమైనది మాత్రమే కాకుండా, పోషకాలతో కూడా నిండి ఉంటుంది. 


అరటి పువ్వు  ప్రయోజనాలు:


అరటి పువ్వులో బోలెడు పోషకాలు ఉంటాయి, ఇందులో ఫైబర్‌,  పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్ వంటి గొప్ప గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం, గ్యాస్‌, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా ఈ అరటి పువ్వు డయాబెటిస్‌ రోగులకు ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్‌ అదుపులో ఉంటాయి. కానీ దీనిని తీసుకోనే ముందు మీరు మీ వైద్యుడి సలహ తీసుకోవడం చాలా అవసరం.


గుండె సంబంధిత సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ సమస్య బారిన పడకుండా ఉండటానికి కూడా ఈ అరటి పువ్వు ఎంతో సహాయపడుతుంది. ఇందులోని పొటాషియం గుండె పనితీరును మెరుగుపరుచుతుంది. అలాగే గుండె జబ్బులను నియంత్రించడంలో మేలు చేస్తుంది. మహిళలు ఈ అరటి పండు పువులను తీసుకోవడం వల్ల ఐరన్ లోపం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది. అరటి పువ్వు పురుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది వీర్యకణాల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది. 


చర్మ సమస్యలకు కూడా ఈ అరటి పువ్వు ఎన్నో లాభాలు పొందవచ్చు. ఇది యాంటీ హిస్టామైన్‌ లక్షణాలు కలిగి ఉండటం వల్ల అలెర్జీలు తగ్గించడంలో సహాయపడుతుంది. సులువుగా బరువు తగ్గాలి అనుకొనేవారు ఈ అరటి పువ్వులు తీసుకోవడం చాలా మంచిది. ఈ పువ్వులో తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 


ఈ అరటి పువ్వును కూరలు, సలాడ్లు, సూప్‌లు, కూరగాయల వంటకాలలో వాడవచ్చు.అరటి పువ్వును ఎంచుకునేటప్పుడు అది ముదురు ఎరుపు రంగులో, గట్టిగా తాజాగా కనిపించే అరటి పువ్వులను ఎంచుకోండి. దెబ్బతిన్న లేదా గోధుమ రంగులో ఉన్న అరటి పువ్వులను తీసుకోవడం మంచిది కాదు.


గమనిక:


మీకు ఏవైనా ఆరోగ్య పరిస్థితులు ఉంటే లేదా మందులు వాడుతుంటే, అరటి పువ్వును ఆహారంలో చేర్చడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.


Also Read: PM Modi To Host Dinner Party: ఢిల్లీ పోలీసులకు ప్రధాని మోదీ డిన్నర్ పార్టీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook