COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Banana Side Effects: మనం ప్రతిరోజు తీసుకునే పనులలో అరటిపండు ఒకటి. ఇందులో శరీరానికి కావాల్సిన పొటాషియం మెగ్నీషియం పరిమాణాలు అధిక మోతాదులో లభిస్తాయి కాబట్టి ప్రతిరోజు ఒకటి నుంచి రెండు అరటి పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఎముకల బలహీనత, కండరాల సమస్యలతో బాధపడేవారు అరటి పండ్లను  ప్రతిరోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కానీ ఈ పండ్లను కొంతమంది తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని వారు తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు. 


అరటి పండ్లలో విటమిన్ బి, మాంగనీస్, ఐరన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. జిమ్ కి వెళ్లేవారు ప్రతిరోజు ఈ పండ్లను తినడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా కండరాల నిర్మాణంలో కూడా అనేక రకాల మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లలో ఫైబర్ పరిమాణాలు కూడా అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి వీటిని బరువు తగ్గాలనుకునే వారు కూడా తినొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  


అరటి పండ్లలో ఉండే పొటాషియం శరీరంలోని రక్త సరఫరాను మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు అరటి పండ్లతో తయారుచేసిన షేక్ ని తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. అంతేకాకుండా గుండె కొట్టుకునే వేగాన్ని కూడా సులభంగా నియంత్రిస్తుంది. రోజు పడుకునే సమయంలో అరటిపండు తీసుకోవడం వల్ల నిద్రలేని సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు శరీరం రిలాక్స్ అవుతుంది. 


అరటి పండ్లు ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి ప్రయోజనాలు కలిగినప్పటికీ కొంతమందికి మాత్రం తీవ్ర దుష్ప్రభావాలను కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు అతిగా అరటి పండ్లను తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు సూచిస్తున్నారు. అంతేకాకుండా జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా అరటి పండ్లను అతిగా తీసుకోరాదని వారంటున్నారు. కాబట్టి తరచుగా పై సమస్యలతో బాధపడుతున్న వారు అరటి పండ్లను రోజూ తినడం మానుకుంటే మంచిది..లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ కూడా ఉంది.


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook