Weight Loss Diet : ఈ మధ్య చాలామంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. బాగా లావుగా ఉన్నవారు మాత్రమే కాక.. శరీరం ఫిట్ గా ఉండాలి అని అనుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ అందులో కొందరు మాత్రమే వెయిట్ లాస్ అవ్వడంలో సక్సెస్ అవుతారు. అలా సక్సెస్ అయ్యి అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలిచిన వారిలో నేవీ చీఫ్ ఇంజనీర్ రజినీష్ కూడా ఒకరు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెంగళూరులో ఉంటున్న రజినీష్ ఆరోగ్య సమస్యల వల్ల ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళరట. బరువు ఎక్కువగా ఉన్న కారణంగా అతి త్వరలోనే  కీళ్ల నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని డాక్టర్ చెప్పగానే కంగారు పడ్డారు రజనీష్. ఇక వెంటనే తన లైఫ్ స్టైల్ మార్చేసి బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడట. అప్పటినుంచి తన డైట్ విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకొని.. ఆరోగ్యంగా వెయిట్ లాస్ అయ్యి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. 


అంతేకాదు ఈయన ఏకంగా 9 నెలలు 20 కేజీలు తగ్గారు. మరి ఇందుకోసం ఆయన ఫాలో అయిన డైట్ ఏమిటో ఒకసారి చూద్దాం.


బ్రేక్ ఫాస్ట్ కోసం రజిని ఉడకపెట్టిన ఒక గుడ్డుతో పాటు కాఫీ లేదా ఏ బి సి జ్యూస్ తాగేవారు. 


లంచ్ లో చికెన్ ఫ్రై లేదా చేపలు, కూరగాయలు, స్ప్రౌట్స్, పప్పు, సెనగలు, రాజ్మా తినేవారు. 


సాయంత్రం పూట బాదాం, వాల్నట్స్, జీడిపప్పు తో పాటు కొన్ని ఫ్రూట్స్ ని తీసుకునేవారు. ఆ తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి చిన్న కప్పు కాఫీ తాగేవారు.


ఇక ఫైనల్ గా రాత్రి సలాడ్, వెజిటేబుల్ కర్రీ, చీలా తినేవారట. 


అయితే తన డైట్ ఫాలో అయినన్ని రోజులు పంచదారని రజిని తన డైట్ నుంచి పూర్తిగా తీసేసారట. ఎప్పుడో ఒకసారి తప్ప చాలా చాలా తక్కువగా షుగర్ ను వాడేవారు.


ఇక అంతే కాకుండా పర్సనల్ ట్రైనర్ ని పెట్టుకున్న.. రజిని జిమ్లో ఎక్కువసేపు వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేశారు. వారానికి కనీసం ఐదు రోజులైనా రజినీష్ జిమ్ కి వెళ్లేవారు. రోజుకి 90 నిమిషాల పాటు కటోరంగా వర్కౌట్లు చేశారు. కార్డియోతో పాటు ఇంకా కొన్ని కష్టమైన వర్కౌట్స్ కూడా చేసేవారట. జిమ్ తోపాటు సాయంత్రం 45 నిమిషాల పాటు వాకింగ్ కూడా చేసేవారు.


ఇలా రజినీష్ 9 నెలల వ్యవధిలో 20 కేజీల వరకు తగ్గాడు. బరువు తగ్గడం మాత్రమే కాక ఆయన అతని రక్తపోటు కూడా కంట్రోల్ లోకి వచ్చేసింది. చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బాగా తగ్గిపోయాయి. ఆరోగ్యం కూడా బాగుపడినట్లు తెలుస్తోంది. ఇక ఈ మధ్యనే ఒక ప్రముఖ మీడియా సంస్థ కి రజినీష్ తన వెయిట్ లాస్ జర్నీ షేర్ చేసుకోవడంతో.. ప్రస్తుతం ఆయన ఫాలో అయిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం చెప్పబడిన వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల కలిగే ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం.


Also Read: Amit Shah: రేవంత్‌ రెడ్డిపై అమిత్‌ షా ఫైర్‌.. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎమ్‌ చేశారని తీవ్ర వ్యాఖ్యలు


Also Read: KCR Live: రేవంత్ రెడ్డికి చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నేనే రిపేర్‌ చేస్తా: కేసీఆర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter