Fever & Bath: జ్వరంతో బాధపడుతున్నప్పుడు స్నానం చేయవచ్చా లేదా, ఏమౌతుంది
Fever & Bath: వర్షాకాలం అంటేనే వ్యాధులు చుట్టుముట్టే సమయం. వివిధ రకాల ఇన్ఫెక్షన్లు ఎదురౌతాయి. అందుకే వర్షాకాలంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వర్షకాలం ఎంత ఆహ్లాదంగా ఉన్నా ఆరోగ్యపరంగా అంత హాని కల్గిస్తుంది.
Fever & Bath: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ముప్పు వెంటాడుతుంటుంది. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు సాధారణమైపోయాయి. వీటితో పాటు వైరల్ జ్వరాలు అధికంగా కన్పిస్తున్నాయి. జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవచ్చా లేదా అనే విషయంలో చాలామందికి సందేహాలుంటాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
సాదారణంగా చాలామంది జ్వరం వచ్చినప్పుడు దుప్పటి లేదా రగ్గు కప్పుకుని ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల శరీరం ఉష్ణోగ్రత మరింతగా పెరిగిపోతుంది. మరోవైపు జ్వరం వచ్చినప్పుడు అత్యధిక శాతం స్నానం చేయరు. స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని నమ్ముతుంటారు. అయితే ఇది ఎంతవరకూ నిజం, జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవచ్చా లేదా అనే విషయంపై వైద్యుల అభిప్రాయం ఎలా ఉందో పరిశీలిద్దాం. జ్వరం వచ్చినప్పుడు సాధారణంగానే శరీరం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా చలి వేస్తుంటుంది. దాంతో ఆ వ్యక్తి పూర్తిగా బలహీనపడిపోయి..ఏ పనీ చేయలేకపోతాడు. చలి నుంచి తప్పించుకునేందుకు దుప్పట్లు, రగ్గులు కప్పుకుంటుంటాడు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత మరింతగా పెరిగిపోతుంది. జ్వరం మరీ ఎక్కువగా లేకపోతే వేడి నీళ్లతో స్నానం చేయవచ్చంటున్నారు వైద్యులు. అంటే జ్వరంలో మాదిరిగా ఉన్నప్పుడు స్నానం చేస్తే త్వరగా నయమౌతుంది. అదే సమయంలో ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకూడదు.
అయితే జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. ముందుగా వైద్యుడి సలహా తీసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు గోరు వెచ్చని నీళ్లతోనే స్నానం చేయాల్సి ఉంటుంది. పూర్తిగా వేడిగా లేదా పూర్తిగా చల్లగా ఉండకూడదు. దీనివల్ల శరీరం చల్లబడటమే కాకుండా నొప్పులుంటే తగ్గుతాయి. జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయాలంటే చాలా తక్కువ సమయంలో ఆ ప్రక్రియ ముగించాలి. అంటే శరీరంపై ఎక్కువ ఒత్తిడి ఉండకూడదు. తేలిగ్గా సబ్బు, నీళ్లతో స్నానం చేయాలి. చెమట పట్టే చోట బాగా శుభ్రం చేయాలి. తద్వారా బ్యాక్టీరియా లేదా ఫంగస్ ముప్పు తగ్గుతుంది.
ఏం చేయకూడదు
స్నానం చేసేటప్పుడు శరీరంపై బలవంతంగా రుద్దకూడదు. ఇది జ్వరాన్ని పెంచుతుంది. స్నానం తరువాత శరీరం పూర్తిగా తుడుచుకుని అప్పుడు పొడి బట్టలు ధరించాలి. ఒకవేళ దగ్గు వంటి ఎలర్జీ ఉంటే దూరంగా ఉండాలి.
ఒకవేళ జ్వరం వచ్చినప్పుడు తడి గుడ్డతో శరీరాన్ని పూర్తిగా తుడవాలి. ఇలా చేయడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఇది చాలా మంచి పద్ధతి. అయితే సాధారణ నీళ్లే ఉపయోగించాలి. చల్లని నీళ్లు ఉపయోగించకూడదు.
Also read: Best Coffee Recipes: కోల్డ్ కాఫీలో ఎన్ని రకాలున్నాయో తెలుసా, మీ కోసం 7 బెస్ట్ కోల్ట్ కాఫీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook