Beetroot Side Effects: వీరు బీట్‌రూట్ అతిగా తింటే అంతే సంగతి.. మీరు కూడా తినొచ్చా?
Beetroot Side Effects: బీట్రూట్ను అతిగా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు పలు అనారోగ్య సమస్యలతో తీవ్ర తరంగా మారొచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
Beetroot Side Effects: బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ బి, విటమిన్ సి, ఫాస్పరస్, కాల్షియం, ప్రొటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి వీటిని తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అయితే వీటిని తినడం వల్ల లాభాలేకాకుండా చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బీట్‌రూట్స్ అతిగా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటిని అతిగా తినడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మధుమేహం ఉన్నవారికి చాలా హానికరం:
మధుమేహం వ్యాధితో బాధపడుతున్నవారికి బీట్‌రూట్ తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారీ తీయోచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బీట్‌రూట్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, మధుమేహం వ్యాధితో బాధపడుతున్నవారు వీటిని తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అల్ప రక్తపోటు:
బీట్‌రూట్ తినడం రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నవారికి హాని కలిగించవచ్చు. ఇందులో నైట్రేట్ అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి దీని కారణంగా రక్తపోటు తీవ్ర వ్యాధిగా మారొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే తక్కువ రక్తపోటు ఉన్న రోగులు బీట్‌రూట్ తినకూడదు.
కిడ్నీల్లో రాళ్ల సమస్యలు:
బీట్‌రూట్ కిడ్నీల్లో రాళ్లను పెంచడానికి దోహదపడుతుంది. అందుకే కిడ్నీ స్టోన్ సమస్యలతో బాధపడేవారు దీనిని తినకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొందరిలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను పెంచుతుంది.
కాలేయా సమస్యలు:
బీట్‌రూట్ జీర్ణక్రియ రేటును పెంచడానికి చాలా ప్రభావవంతంగా సహాయపడుతుంది. అయితే దీనిని అతిగా తినడం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి కాలేయా సమస్యలతో బాధపడేవారు దీనిని తినకపోవడం చాలా మంచిది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Ys jagan: ఏపీలో పెట్టుబడులకై స్వయంగా రంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్, ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీ
Also read: Ys jagan: ఏపీలో పెట్టుబడులకై స్వయంగా రంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్, ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook