Belly Fat Burn: ఏ ఎక్సర్సైజ్ చేయకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది తెలుసా?
Belly Fat Burning Tips: దాల్చిన చెక్క మన వంట గదిలో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఒక మసాలా. దీనితో రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగవు. ఇవి నేచురల్ ఇన్సులిన్ లా కూడా పనిచేస్తుంది. అయితే దాల్చిన చెక్కతో బరువు కూడా సులభంగా తగ్గుతారు.
Belly Fat Burning Tips: బెల్లీ ఫ్యాట్ తగ్గాలని వెయిట్ లాస్ అవ్వాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. దీనికి అనేక జాగ్రత్తలు తీసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ పాటిస్తారు. కానీ కొన్ని కారణాలవల్ల కొంతమందికి బెల్లీ ఫ్యాట్ తగ్గదు అయితే కొన్ని ఎక్సర్సైజులు చేయకుండానే సులభంగానే ఇంట్లోనే వెయిట్ లాస్ అవ్వాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. దీంతో సులభంగా బెల్లీ ఫైట్ బర్న్ అయిపోతుంది అవి ఏంటో తెలుసుకుందాం.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క మన వంట గదిలో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఒక మసాలా. దీనితో రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగవు. ఇవి నేచురల్ ఇన్సులిన్ లా కూడా పనిచేస్తుంది. అయితే దాల్చిన చెక్కతో బరువు కూడా సులభంగా తగ్గుతారు. అది కూడా ఇంట్లోనే ఈజీగా ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఖనిజాలు సులభంగా జీర్ణం అవ్వడానికి కొలెస్ట్రాల్ తగ్గడానికి బెల్లీ ఫ్యాట్ కూడా చెక్ పెట్టడానికి పనిచేస్తుంది. ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని పరగడుపున రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీరు మ్యాజికే చూస్తారు.
నీళ్లు..
మనం రోజంతటికి తగ్గిన హైడ్రేషన్ ఉండడానికి సరిపోయే అన్ని నీళ్లు తాగాలి. ఇది మన ఆరోగ్యానికి ప్రోత్సహిస్తుంది బరువు నిర్వహిస్తుంది. మన శరీరానికి కావాల్సిన అంత నీరు తీసుకుంటూ ఉండాలి. ఇది మెటబాలిజం రేటు ని పెంచుతుంది. ఈజీ జీర్ణ క్రియ కూడా సహాయపడుతుంది ప్రతిరోజు 8 కప్పుల వీలైన తాగాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: మీ ఇంటి కిచెన్లో పొరపాటున ఈ 6 వస్తువులను పెట్టారా? వెంటనే తీసేయండి..కారణం తెలిస్తే షాక్ అవుతారు..
ఫైబర్..
ఇంట్లోనే ఈజీగా బరువు తగ్గాలనుకునే వారు ముఖ్యంగా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి ఎందుకంటే ఈ ఆహారాల వల్ల తరచూ మనకు ఆకలి వేయదు. ఎక్కువ సేపు తినకుండా ఉంటాము. ఈజీగా బరువు పెరగకుండా ఉంటారు. అంతేకాదు ఈ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగనివ్వవు. ఫైబర్ పుష్కలంగా ఉండే ఆకుకూరలు ,కూరగాయలు, తృణధాన్యాలను మన డైట్ లో చేర్చుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గుతాం.
ప్రోటీన్..
ప్రోటీన్ తో కూడా ఈజీగా బరువు తగ్గవచ్చు. ఇది బాడీ మెటబాలిజం రేటును పెంచుతుంది .ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. ప్రోటీన్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కండరాల పనితీరు కూడా మెరుగవుతుంది. చికెన్, గుడ్లు, చేపలు తోఫు, బీన్స్ వంటి ఆహారాలు మన డైట్ లో చేర్చుకుంటే ఇది మనకు అతిగా ఆకలి వేయకుండా నివారిస్తుంది.
ఇదీ చదవండి: ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే యమడేంజర్.. మీ ఇంటి చుట్టే పాములు తిరుగుతాయట..!
అయితే ఇవన్నీ పాటించడంతో పాటు అధిక ఎక్కువ మొత్తంలో ఒకేసారి ఫుడ్ తీసుకోకూడదు. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. కొద్ది మొత్తంలో ఎక్కువ సమయం ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల మనకు ఈజీగా అరుగుతుంది త్వరగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు బరువు కూడా పెరగకుండా ఉంటారు అంతేకాదు ఆహారం తీసుకునేటప్పుడు బాగా నమిలి మింగితే మంచిది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి