Belly Fat Reduce: చలికాలంలో బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఇంతకంటే సులభమైన పద్దతులేమి లేవు!
Belly Fat Reduce: పొట్ట చుట్టు కొలెస్ట్రాల్ సమస్యలతో ప్రస్తుతానికి చాలామంది బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు డైట్ లో భాగంగా పలు రసాలను తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
Belly Fat Reduction Tips: అమ్మాయి సన్ననైనా నడుముతో ఉంటేనే చూడడానికి బాగుంటుంది. ఆధునిక జీవన శైలి కారణంగా ప్రస్తుతం చాలామంది లావుగా పొట్ట చుట్టుకొలస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే దీనిని తగ్గించుకోవడానికి ప్రతి రోజు గంటల తరబడి వ్యాయామాలు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్, శరీర బరువును తగ్గించుకోలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరోగ్య నిపుణులు పలు రకాల చిట్కాలు చెబుతున్నారు. వాటిని పాటించడం వల్ల బరువు తగ్గడమే కాకుండా.. పొట్ట చుట్టు కొలస్ట్రాలు కూడా సులభంగా తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనికోసం తప్పకుండా పాటించే డైట్ లో కూరగాయలతో తయారుచేసిన జ్యూస్ లను ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది. ఆ జ్యూస్ లు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
దోసకాయ, కివి జ్యూస్:
వీటితో తయారుచేసిన జ్యూస్ ను ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా శరీర బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
ఉసిరి రసం:
ఉసిరికాయ రసం మధుమేహంతో బాధపడుతున్న వారికే కాకుండా బరువు తగ్గడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ సి బరువును తగ్గించి శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తుంది. కాబట్టి సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఈ రసాన్ని రెండు పూటలా తాగాల్సి ఉంటుంది.
సొరకాయ రసం:
సొరకాయ రసంలో కూడా చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. దీనిని క్రమం తప్పకుండా తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడి శరీర బరువును సులభంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రించేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రసం ప్రభావంతంగా సహాయపడుతుంది.
క్యాబేజీ రసం:
క్యాబేజీ రసంలో కూడా శరీరానికి సంబంధించిన పోషక విలువలు అధిక పరిమాణంలో లభిస్తుంది కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ క్యాబేజీ రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి కీలకంగా సహాయపడుతుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి