Belly Fat: బాన పొట్ట తగ్గాలంటే పాటించాల్సిన నియమాలు ఏంటి..?
Tips For Belly Fat: ప్రస్తుతకాలంలో చాలా మంది బాన పొట్టతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య వల్ల కొంతమంది మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎలాంటి చికిత్స లేకుండా కేవలం కొన్ని టిప్స్ పాటించడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.
Tips For Belly Fat: బాన పొట్ట అంటే మన శరీరంలోని కడుపు భాగంలో అధికంగా కొవ్వు చేరడం. ఇది కేవలం అందం మీదే ప్రభావం చూపదు, కానీ అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. బాన పొట్ట ఎలా వస్తుంది. దీని నుంచి ఎలా ఉపశమనం పొందవచ్చు అనే వివరాలు తెలుసుకుందాం.
బాన పొట్ట ఎలా వస్తుంది?
మనం తినే ఆహారంలో కేలరీలు ఎక్కువగా ఉంటే మన శరీరం వాటిని కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ముఖ్యంగా చక్కెరలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల బాన పొట్ట వచ్చే అవకాశం ఎక్కువ. సరైన వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా బాన పొట్ట వస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే వ్యాయామం మంచిది. ఇలా చేయడం వల్ల కేలరీలు కాలిపోయి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కొంతమందిలో బాన పొట్ట వచ్చేందుకు జన్యువులు కూడా కారణం కావచ్చు. వయసు పెరిగే కొద్దీ శరీరంలోని జీవక్రియ రేటు తగ్గుతుంది. దీంతో కేలరీలు కాలిపోవడం తగ్గి, బాన పొట్ట వచ్చే అవకాశం పెరుగుతుంది. కొన్ని హార్మోన్ల అసమతుల్యత కూడా బాన పొట్టకు కారణం కావచ్చు. ఉదాహరణకు, కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా ఉండటం వల్ల బాన పొట్ట వచ్చే అవకాశం ఉంటుంది. సరిగ్గా నిద్ర పోకపోవడం వల్ల కూడా బాన పొట్ట వచ్చే అవకాశం ఉంటుంది.
బాన పొట్ట వల్ల కలిగే ఇబ్బందులు:
బాన పొట్ట వల్ల గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, కొన్ని రకాల క్యాన్సర్‌లు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. బాన పొట్ట ఊపిరితిత్తులపై ఒత్తిడి తెస్తుంది దీంతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అంతేకాకుండా అధిక బరువు మోకాలు, వీపు వంటి కీళ్లపై ఒత్తిడిని పెంచి నొప్పులకు కారణమవుతుంది. బాన పొట్ట జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే అధిక బరువు కారణంగా అండాశయ సమస్యలు, అనియమిత మెన్స్ట్రుయేషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం ఆరోగ్యం పై మాత్రమే కాకుండా మానసిక ఇబ్బందులు కూడా ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడానికి దారితీస్తుంది. కొంతమంది డిప్రెషన్ బారిన పడతుంటారు. శరీరాన్ని చూసి ఇతరులు ఎలా అనుకుంటారనే భయంతో సామాజిక కార్యకలాపాలకు దూరంగా ఉంటారు.
బాన పొట్టను తగ్గించుకోవడం ఎలా?
ఆరోగ్యకరమైన ఆహారం: తాజా కూరగాయలు, పండ్లు, గింజలు, చేపలు, మాంసం తినడం మంచిది.
వ్యాయామం: రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.
నిద్ర: రోజూ 7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం.
ఒత్తిడిని నిర్వహించుకోవడం: యోగా, మెడిటేషన్ వంటివి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
వైద్యుడిని సంప్రదించండి: బాన పొట్ట ఎక్కువగా ఉంటే, వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది.
Disclaimer: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.
Also Read: Belly Fat: సెలెరీ టీని ఎప్పుడైనా ట్రై చేశారా? బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ టీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook