Corn Silk benefits: మొక్కజొన్నపీచును తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ మొక్కజొన్న పీచులో విటిమిన్‌ సి, బి, కె, ఫైబర్‌ పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారు ఈ పీచును తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలో ఎల్లపుడు ప‌ని చేసే అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు ఒకటి. ఇది శ‌రీరంలో  ర‌క్తాన్నిలో ఉండే మ‌లినాలను బ‌య‌ట‌కు పంపిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. 


కిడ్నీలో రాళ్లు ఎలా చేరుతాయి అంటే రక్తంలో ఉండే మలినాలు ఎక్కువవడం వల్ల ఈ రాళ్లు చేరుతాయి. అంతేకాకుండా  యూరిన్‌లో ఉండే  క్యాల్షియం, పొటాషియం, సోడియం ఇతర పదార్థాలు ఎక్కవ శాతంలో ఉన్నప్పుడు ఇవి కిడ్నీలో చిన్న చిన్న రాళ్ల లాగా ఏర్ప‌డుతాయి. ఈ రాళ్లు క్ర‌మంగా పెద్ద‌వి అయ్యి తీవ్ర‌మైన నొప్పికి దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. 


ఈ రాళ్ల కార‌ణంగా మూత్రాశ‌యం, మూత్ర‌నాళాలు తీవ్రంగా దెబ్బ‌తింటాయి. యూరిన్‌ లో ఆక్సలేట్‌, క్యాల్షియం ఎక్కువగా ఉడడం వల్ల 80 % రాళ్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే యూరిక్ యాసిడ్ లెవల్స్‌ ఎక్కువ‌గా ఉండటం వల్ల మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌తాయి. ఈ సమస్య నుంచి బయట పడాలి అనుకొనే వారు కొన్ని చిట్కాల‌ను పాటించడం వ‌ల్ల కిడ్నీలో ఉండే రాళ్ల స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.


Also read: White Hair: చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి కారణాలు.. మానుకోవాల్సిన అలవాట్లు..


మొక్కజొన్న పీచు ఉపయోగాలు..


మొక్కజొన్న పీచు తీసుకోవడం వల్ల శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.


మొక్కజొన్న పీచు తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు, గుండెపోటు వంటి ప్రమాదల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.


యూరిన్ ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో ఈ మొక్కజొన్న పీచు చాలా ఉపయోగపడుతుంది. 


మొక్కజొన్న పీచు తీసుకోవడం డయాబెటిస్ నియంత్రించడంలో చాలా ఉపయోగపడుతుంది.


అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ఈ మొక్కజొన్న కంకు పీచు తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. 


అంతేకాకుండా దీని ఆకులు జ్యూస్ చేసి తీసుకోవ‌డం వ‌ల్ల రాళ్ల స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌చ్చు.


Also read: Hibiscus Tea Benefits: మందార పువ్వుల టీ .. దీన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలకు చెక్‌..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి