Ramaphalam Benefits For Health: మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్లో రకరకాల పండ్లు లభిస్తాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కోరకమైన పండు లభిస్తుంది అది మన అందరికీ దేవుడిచ్చిన వరం. ముఖ్యంగా చలికాలం నుంచి ఎండాకాలం ప్రారంభం కాగానే అందరికీ మార్కెట్లో రామా ఫలం కనిపిస్తుంది. ఇది చూడడానికి అచ్చం సీతాఫలా ఉన్న టేస్ట్ లో మాత్రం కొంత వేయరని చెప్పవచ్చు. ఇది మిగతా సీజన్లో మార్కెట్లో చాలా అరుదుగా లభిస్తుంది అందుకే మనం వీటిని ఎక్కువగా వేసవికాలం ప్రారంభంలో చూస్తూ ఉంటాం. అయితే రామా ఫలం తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో బాడీకి కావాల్సిన అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం శరీరానికి ఎంతో మంచిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామా ఫలం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికే కాకుండా చర్మానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా జుట్టు చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రామ ఫలాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఇందులో ఉండే గుణాలు జుట్టు చిట్లడం, వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. దీంతోపాటు చర్మాన్ని ఆరోగ్యంగా హైడ్రేట్ గా తయారు చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి తీవ్ర చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ ఫలాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.


Also Read Consistency in children: పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే వీటిని ప్రయత్నించాల్సిందే!
ఈ రామా ఫలం మధుమేహం ఉన్నవారికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఇది నోటికి తీయగా అనిపించినప్పటికీ ఇందులో సహజంగా లభించే చక్కెర పరిమాణాలు ఉంటాయి కాబట్టి రక్తంలోని చక్కెర పరిమాణాలు తగ్గడం పెరగడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ ఫలాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి. దీనికి కారణంగా సీజనల్ వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.


అంతేకాకుండా ఈ ఫలం లో యాంటీ ఇన్ ప్లామేట‌రీ గుణాలు కూడా అధిక మోతాదులో లభిస్తాయి కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాకుండా ఇది మోకాళ్ళ నొప్పులను అరికట్టేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు గుండె సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ రామా ఫలాన్ని తీసుకోవచ్చు. ఈ ఫలాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. దీంతోపాటు శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.


Also Read Ginger Side Effects: అల్లాన్ని వినియోగించే వారికి బ్యాడ్‌ న్యూస్‌..ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter