Type-2 Diabetes Food:​ ఆధునిక జీవనశైలిలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా చాలా మంది వారి వయస్సుకు సంబంధం లేని తీవ్రమైన జబ్బుల బారిన పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా డయాబెటిస్‌ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే డయాబెటిస్‌ వచ్చిన వారిలో అధికంగా చిన్న వయసు వారు ఎక్కువగా ఉండటం గమనార్ధం. ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో ఎలాంటి ఆహారం తీసుకున్న బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ సులువుగా పెరుగుతాయి. దీని కారణంగా తీవ్రమైన సమస్యలను ఎదురుకోవాల్సి ఉంటుంది. అయితే డయాబెటిస్‌ టైప్‌-2తో బాధపడుతున్నవారు అవకాడో పండు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండు డయాబెటిస్‌ టైప్‌-2కు ఎలా ఉపయోగపడుతుందో మనం ఇక్కడ తెలుసుకుందాం 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డయాబెటిస్‌ ఎలా సంభవిస్తుందని..?


శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి తగినంతగా లేనప్పుడు రక్తంలో గ్లూకోజ్ ఉన్న జీవక్రియ వ్యాధి సమూహం వల్ల డయాబెటిస్‌ సంభవిస్తుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు సాధారణంగా తీవ్రమైన ఆకలి, తరచుగా దాహం వంటి లక్షణాలు అనుభూతి చెందుతారు. మధుమేహం రెండు రకాలు. అవి టైప్‌-1, టైప్‌-2 గా  వైద్యలు చెబుతుంటారు. టైప్ 2 డయాబెటిస్ వారిలో రక్తంలో అధిక చక్కెర స్థాయి ఏర్పడుతుంది. వీరు తీసుకుంటున్న ఆహార పదార్థాలలో చక్కెర ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి. చక్కెర తక్కువగా ఉండి రక్తంలో చక్కెర స్థాయిని పెంచకుండా ఉండే ఆహారం ఎంటీ అంటే అవకాడో  అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


అవకాడో  ఎలా సహాయపడుతుంది..


ఆరోగ్యకరమైన ఆహారం  తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అవకాడో తీసుకోవడం ద్వారా  టైప్ 2 డయాబెటిస్ సమస్యను సులువుగా నియంత్రించుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. అవకాడోలో అధిక కొవ్వు తక్కువ కార్బోహైడ్రేట్ కలిగి ఉంటుంది.  అవోకాడో  రోజు తీసుకోవడం కారణంగా కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులోని విటమిన్ సి, ఇ తో పాటు కెరోటినాయిడ్స్ వంటి మూలకాలు కనిపిస్తాయి. ఇవి శరీరంలో నొప్పులు, వాపును తగ్గించగలవు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.


 


Also Read: Tourist Places : స్వదేశంలోనే విదేశీ అనుభూతి ఇచ్చే టూరిస్ట్ ప్లేసెస్.. న్యూ ఇయర్ కి బెస్ట్ ప్లాన్


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి