Tourist Places : స్వదేశంలోనే విదేశీ అనుభూతి ఇచ్చే టూరిస్ట్ ప్లేసెస్.. న్యూ ఇయర్ కి బెస్ట్ ప్లాన్

Holiday trip: న్యూ ఇయర్ కి కుటుంబంతో కాస్త సరదాగా గడపాలి అనుకుంటే ముందు మనకు బడ్జెట్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇండియాలోనే ఎంచక్కా ఫ్యామిలీతో ఫారన్ కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ అందించే టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం పదండి..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2023, 08:01 PM IST
Tourist Places : స్వదేశంలోనే విదేశీ అనుభూతి ఇచ్చే టూరిస్ట్ ప్లేసెస్.. న్యూ ఇయర్ కి బెస్ట్ ప్లాన్

Tourist places:
మన రెగ్యులర్ రొటీన్ లైఫ్ స్టైల్ నుంచి కాస్త బయటకు వచ్చి ఫ్యామిలీతో సరదాగా గడపాలి అనుకోని వ్యక్తి ఉండరు. సరదాగా సెలవులు వస్తున్నాయంటే ఫ్యామిలీతో కలిసి ఎక్కడికో ఒక దగ్గరికి టూర్ ప్లాన్ చేయాలి అనుకుంటాం. ముఖ్యంగా డిసెంబర్లో క్రిస్మస్ న్యూ ఇయర్ సెలవలకి ఎక్కడికి పోదాము అంటూ ప్లాన్ చేయని వారు ఉండరు. కానీ అదే సమయంలో ఎక్కడికి వెళ్లాలి.. ఎంత బడ్జెట్ అవుతుంది అన్న విషయంపై చాలా సేపు ఆలోచిస్తాం. అలాంటి మీ కోసం ఇండియాలోనే ఫారిన్ ఎక్స్పీరియన్స్ ని అందించే టూరిస్ట్ స్పొట్స్..

గోవా 

మంచి బీచ్ లొకేషన్స్ మీరు ఇష్టపడే పని అయితే.. సముద్ర తీరంలో ఫ్యామిలీతో సరదాగా గడపాలి అన్న ఆశ మీకు ఉంటే.. ఈసారి మీ టూర్ లోకేషన్ గోవానే. బీచ్ రిసార్ట్స్, సముద్రతీరం, చల్లని గాలి, ఇసుక తిన్నెలు.. ఊహించుకోవడానికి చాలా అద్భుతంగా ఉండే ఈ లొకేషన్స్ అన్ని గోవాలో అవైలబుల్ గా ఉంటాయి. ముందుగానే అన్ సీజన్ చూసి చక్కగా ప్లాన్ చేసుకుంటే మంచి ప్యాకేజీ తో సాలిడ్ గా గోవా ట్రిప్ వేసి వచ్చేయొచ్చు. పైగా ఇప్పుడు చాలా ట్రావెలింగ్ కంపెనీలు ఈ విజిట్స్ పై ఆఫర్స్ కూడా ఇస్తున్నాయి.

జైపూర్

రాజస్థాన్లోని పింక్ సిటీ గా ఫేమస్ పొందిన జైపూర్.. మీకు ఒక మంచి టూరిస్ట్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. రాయల్ లైఫ్ స్టైల్ కళ్ళకు కట్టినట్టు చూపించే హెరిటేజ్ హోటల్స్.. ఆథెంటిక్ రాజస్థానీ ఫుడ్.. ఒంటి సవారి..లోకల్ హండిక్రాఫ్ట్స్ .. ఇలా జైపూర్లో మీకు నచ్చే ఎన్నో అంశాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా పిల్లల కోసం ఏనుగు సవారి తో పాటు అద్భుతమైన తోలుబొమ్మ ప్రదర్శనలు కూడా ఉంటాయి.

కేరళ

గాడ్స్ ఓన్ కంట్రీ గా పేరు పొందిన కేరళ.. చుట్టు పచ్చదనం .. ఎత్తైన కొండలు.. లోయలు.. మంచి స్పైసెస్ వాసనతో నిండిన గాలులు.. కేరళలో ఎంటర్ అయిన ఎవరికైనా స్వాగతం పలికే ప్రకృతి ఎంతో మనోరంజకంగా ఉంటుంది. బ్యాక్ వాటర్ పై బోటు విహారం మరువలేని అనుభూతిని అందిస్తుంది. పెద్దవారి దగ్గర నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరు ఎంతో ఆస్వాదించదగిన ట్రిప్ కేరళ. అయితే కరెక్ట్ సీజన్లో దీన్ని ప్లాన్ చేసుకోవాలి. 

రిషికేశ్

మీకు మంచి అడ్వెంచర్స్ ట్రిప్ కావాలి అనుకున్నా ..లేదు ఆధ్యాత్మికమైన ప్రపంచాన్ని చూడాలి అనుకున్నా ..రెండు రకాలుగా రిషికేష్ బెస్ట్ ఆప్షన్. హిమాలయాల్లో కొలువున్న రిషికేష్ ఇచ్చే డివైన్ వైబ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు అది కేవలం ఎవరికి వాళ్లు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఢిల్లీకి బాగా దగ్గరలో ఉన్న రిషికేష్ చేరుకోవడానికి ఢిల్లీ నుంచి ఎప్పుడు బస్సు వసతి రెగ్యులర్ గా ఉంటుంది. ఎంతో ప్రశాంతమైన వాతావరణం, నది తీరం అంతకుమించి హిమాలయాల ఔన్నత్యం చూడాలి అనుకుంటే రిషికేష్ కి తప్పకుండా వెళ్ళండి.

అండమాన్ - నికోబార్ దీవులు

మనలో చాలామందికి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటే మ్యాప్ చివరన ఉండే ఐలాండ్స్ గా మాత్రమే తెలుసు తప్ప వాటిలో ఉన్న నాచురల్ వండర్స్ గురించి తెలియదు. ఇక్కడ సహజమైన బీచ్ లతోపాటు క్రిస్టల్ క్లియర్ వాటర్ టూరిస్టులకు ఒక మధురమైన అనుభూతిని ఇస్తుంది. అడ్వెంచరస్ ట్రిప్ కి వెళ్ళాలి అనుకున్న వాళ్లకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ విసిట్ చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ గా మిగులుతుంది.

Also Read:  Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా

Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FaceTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News