Pillow Benefits: పాదాల కింద దిండు పెట్టుకుని పడుకుంటే.. కేవలం 10 నిమిషాల్లో నొప్పులు తగ్గుతాయి..
Benefits of keeping Pillow under Legs: గర్భధారణ సమయంలో మహిళలు తరచుగా వారి పాదాల క్రింద దిండుతో నిద్రపోతారు. అయితే ఇలా నిద్ర పోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు తెలుపుతున్నారు.
Benefits of keeping Pillow under Legs: గర్భధారణ సమయంలో మహిళలు తరచుగా వారి పాదాల క్రింద దిండుతో నిద్రపోతారు. అయితే ఇలా నిద్ర పోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల కొందరిలో శరీర సమస్యలు వచ్చిన.. మరి కొందరిలో మంచి ప్రయోజనాలే కలుగుతున్నాయి. అయితే కాళ్ళ క్రింద దిండు పెట్టుకుని నిద్రపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భిణీ స్త్రీలకు ఈ ప్రయోజనాలు:
కాళ్ళ క్రింద దిండు పెట్టుకుని నిద్రపోవడం వల్ల గర్భిణీ స్త్రీలకు శరీరంపై బరువు తగ్గుతుంది. అంతేకాకుండా పడుకునే సందర్భంలో శరీరమంతా బరువు సమానంగా ఎర్పడుతుంది. ముఖ్యంగా కాళ్ళలో వాపును తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. గర్భిణీ స్త్రీలలో వెన్నునొప్పులు రావడం సహజం అయితే ఇలా రోజూ పడుకునే సందర్భంలో దిండు పెట్టుకుని నిద్రపోవడం వల్ల నొప్పులు సులభంగా తగ్గుతాయి.
సయాటికా నొప్పిల నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
పాదాల కింద దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల సయాటికా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఇలా చేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ముఖ్యంగా వెన్నెముకపై ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.
రక్త ప్రసరణ:
పాదాల్లో రక్తప్రసరణ సరిగా లేకపోవడంతో తీవ్ర మంటలు, నొప్పులు ఉత్పన్నమవుతాయి. పాదాల కింద దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతాయి. కాబట్టి ఇలాంటి సయస్యలతో బాధపడేవారు తప్పకుండా రోజూ ఇలా నిద్రపోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read:Krishnam Raju Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook