Health Benefits Of Raw Garlic: ఆయుర్వేదం నుంచి ఆధునిక వైద్యం వరకు వెల్లుల్లిని దాని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. పచ్చి వెల్లుల్లిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో నమలడం ఆరోగ్య నిపుణులు బాగా సిఫార్సు చేసే అలవాటు. ఇది కేవలం వంటలకు మాత్రమే కాకుండా  అనేక ఆరోగ్య సమస్యలకు సహజమైన నివారణగా పనిచేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెల్లుల్లిలో అల్లిసిన్‌ అనే పదార్థం పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక ప్రాత పోషిస్తుంది. దీని కారణంగా అనారోగ్యసమస్యల బారిన పడకుండా ఉంటాము. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఉపయోగపడుతాయి. పచ్చి వెల్లుల్లి నమలడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో తెలుసుకుందాం.


ఉదయం పచ్చి వెల్లుల్లి నమలడం వల్ల అధిక రక్తపోటు సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో మేలు చేస్తుంది. తరుచు జలుబు , దగ్గు, ఫ్లూ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు దీని వల్ల ఉపశమనం పొదవచ్చు. కొన్ని క్యాన్సర్ కణాల పెరుగుదలను తొలగించడంలో మేలు చేస్తుంది. మొటిమలు, ముద్దలు వంటి చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా  మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 


ఎలా తీసుకోవాలి? 


వెల్లుల్లిని సలాడ్‌లు, సూప్‌లు, కూరగాయల వంటకాలు, చట్నీలు మొదలైన వాటిలో చేర్చి తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి రుచి మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. 


వెల్లుల్లిని పేస్ట్ లేదా పూతగా తయారు చేసి రొట్టె లేదా ఇతర ఆహార పదార్థాలపై రాసుకోవచ్చు. దీని ఎండబెట్టి పొడిగా చేసి, అవసరమైనప్పుడు ఆహారంలో చేర్చవచ్చు.


ఎంత తీసుకోవాలి?


రోజుకు ఒక లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవడం సాధారణంగా సురక్షితంగా పరిగణించబడుతుంది. అయితే ఆరోగ్య పరిస్థితి, తీసుకునే ఇతర మందులను బట్టి ఈ మోతాదు మారవచ్చు. వెల్లుల్లిని ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోవడానికి వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.  ఈ విధంగా వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందచ్చు. దీని పరగడుపున తీసుకోవడం వల్ల అనుకున్న ఫలితాలు పొందుతారు.


ముగింపు:


పచ్చి వెల్లుల్లిని ఉదయాన్నే నమలడం ఒక సరళమైనది.  ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి  అనేక వ్యాధుల నుంచి  రక్షించడానికి సహాయపడుతుంది. ఏదైనా ఆహార పదార్థాన్ని  ఆహారంలో చేర్చే ముందు మీ వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.